జైపూర్ నుంచి బెంగళూరు వెళుతున్న ఎయిర్ ఏషియా విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దిగింది. ఎయిర్ బస్ 1543 విమానం 76 మంది ప్రయాణికులతో జైపూర్ నుంచి బెంగళూరు వెళుతుండగా.. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
అనంతరం చండీగఢ్ నుంచి బెంగళూరుకు వెళుతున్న మరో ఎయిర్ ఏషియా విమానాన్ని శంషాబాద్‌కు దారి మళ్లించి ప్రయాణికులను బెంగళూరుకు తరలించారు. ఘటనపై పౌర విమానయాన అధికారులు ఆరా తీశారు.
ఇదీచూడండి: 14వ అంతస్తు పైనుంచి దూకి వైద్య విద్యార్థిని ఆత్మహత్య