ETV Bharat / state

ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గోదావరిలో గల్లంతు

భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు కుటుంబసమేతంగా వెళ్లిన వారిని ఊహించని ప్రమాదం కాటేసింది. గోదావరి ప్రవాహానికి బోల్తాపడిన బోటు వారి జాడను గల్లంతు చేసింది. ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 12 మందిలో 11 మంది గల్లంతయ్యారు.

ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గోదావరిలో గల్లంతు
author img

By

Published : Sep 16, 2019, 7:26 AM IST

Updated : Sep 16, 2019, 9:26 AM IST

ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గోదావరిలో గల్లంతు

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదం విశాఖకు చెందిన ఓ కుటుంబంతో పాటు వారి బంధువుల్లో పెను విషాదాన్ని నింపింది. ముక్కుపచ్చలారని అయిదుగురు చిన్నారులతో సహా 11 మంది గల్లంతయ్యారు. మొత్తం 12 మంది భద్రాచలం వెళ్లేందుకు విశాఖ నుంచి బయలుదేరి వెళ్లగా ఒకరు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వారంతా బంధువులు కావడం విషాదాన్ని మరింత పెంచింది.

విశాఖ మహారాణిపేటలోని రామలక్ష్మి నగర్ కాలనీకి చెందిన మధుపాడ రమణబాబు కుటుంబం సహా వారి బంధువులు 11 మంది గల్లంతైన వారిలో ఉన్నారు. కారు డ్రైవర్​గా పని చేస్తున్న రమణబాబుతో పాటు ఆయన భార్య అరుణకుమారి, ఇద్దరు పిల్లలు అఖిలేశ్, కుషాలి విహారయాత్రకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. మధుపాడ రమణ బాబు సొంతూరు అనకాపల్లి మండలం చెనుల అగ్రహారం కాగా బతుకుదెరువు కోసం భార్య పిల్లలతో కలిసి విశాఖపట్నంలో ఉంటున్నట్లు తెలిసింది.

12 మందిలో ఒకరు సురక్షితం

కారు డ్రైవింగ్ చేసుకుంటూ జీవిస్తున్న రమణబాబు, కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం విశాఖ నుంచి రాజమహేంద్రవరం వెళ్లారు. రమణబాబు(35), ఆయన భార్య అరుణకుమారి(27), వారి పిల్లలు అఖిలేశ్(7), కుషాలి(5), అత్త బోశాల లక్ష్మి, ఆమె మనవరాలు సుశీల(3), రమణబాబు చిన్నత్త పెద్దిరెడ్డి దాలెమ్మ(45), రమణబాబు పెద్దక్క తలారి అప్పల నరసమ్మ(50), ఆమె కుమారుడి పిల్లలు గీతా వైష్ణవి(4), అనన్య(2), రమణబాబు చిన్నక్క బొండా లక్ష్మి(40), ఆమె కుమార్తె పుష్ప(13), గోపాలపురానికి చెందిన బోశాల పూర్ణ(22)లు విశాఖ నుంచి రాజమహేంద్రవరం వెళ్లిన వారిలో ఉన్నారు. వారిలో బోశాల పూర్ణ మినహా మిగిలిన 12 మంది ఒక కుటుంబానికి చెందిన వారే. చిన్నక్క వేపగుంటలో నివసిస్తుండగా.. పెద్దక్క ఆమె మనవరాళ్లు అరిలోవలోని దుర్గాబజార్​లో ఉంటున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారందరూ రైల్వే స్టేషన్ వెళ్లడానికి అనువుగా ఉంటుందని రాత్రి రమణబాబు ఇంటికి వచ్చారు. రాజమహేంద్రవరంలో దిగి భద్రాచలం వెళ్లడానికి పడవ ఎక్కారు. అనంతరం జరిగిన ప్రమాదంలో రమణబాబు అత్త బోశాల లక్ష్మిని సిబ్బంది రక్షించారు. మిగిలిన 11 మంది గల్లంతయ్యారు.

కమాండ్ కంట్రోల్ రూమ్

విశాఖ జిల్లాకు చెందిన గల్లంతయిన వారి ఆచూకీ కోసం తూర్పుగోదావరి అధికారులతో విశాఖ యంత్రాంగం సంప్రదింపులు చేస్తోంది. విశాఖ కలెక్టరేట్లో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. డీఆర్వో శ్రీదేవి నేతృత్వంలో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని బంధువులకు ఇస్తున్నారు. ప్రమాదం నుంచి బయట పడిన లక్ష్మిని కలుసుకోవడానికి మిగతా వారి ఆచూకీ తెలుసుకునేందుకు వీలుగా బాధితుల బంధువులను అధికారులు దేవీపట్నానికి తీసుకెళ్లారు.

ఇదీచూడండి: 300 అడుగుల లోతులో బోటు... సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం

Intro:స్క్రిప్ట్ కరువు తీవ్ర వర్షాభావం లోను సజ్జ సాగు చేసి అధిక దిగుబడులు సాధించి ఔరా అనిపించుకున్న రైతుల పై ప్రత్యేక కథనం రైతుల వాయిస్

Body:బైట్స్ 1. జి రమణ రైతు కేకల దొడ్డిపల్లి 2. చంద్ర నాయక్ రైతు కొలిమి మట్ట 3. చంద్ర గోపాల్ సాగు దారుడు సుండుపల్లి 4. ఎం బాలయ్య రైతు మడితాడు 5. సుబ్బయ్య రైతు చిన్న గొల్లపల్లి 6. సుధాకర్ సాగు దారుడు కేకల దొడ్డి పల్లి కేకలు 7. వీరబల్లి ఆది శేఖర్ రైతు పొలిమేర పల్లి దళిత వాడ రాజశేఖర్ 8. బి వి రత్నం పల్లె జీవనం పథకం అమల దారుడు 9. చిన్నప్ప సాగు దారుడు చిన్న గొల్లపల్లి

Conclusion:బైట్స్ 1. జి రమణ రైతు కేకల దొడ్డిపల్లి 2. చంద్ర నాయక్ రైతు కొలిమి మట్ట 3. చంద్ర గోపాల్ సాగు దారుడు సుండుపల్లి 4. ఎం బాలయ్య రైతు మడితాడు 5. సుబ్బయ్య రైతు చిన్న గొల్లపల్లి 6. సుధాకర్ సాగు దారుడు కేకల దొడ్డి పల్లి కేకలు 7. వీరబల్లి ఆది శేఖర్ రైతు పొలిమేర పల్లి దళిత వాడ రాజశేఖర్ 8. బి వి రత్నం పల్లె జీవనం పథకం అమల దారుడు 9. చిన్నప్ప సాగు దారుడు చిన్న గొల్లపల్లి
Last Updated : Sep 16, 2019, 9:26 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.