ETV Bharat / state

స్థానిక సమరానికి సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం

స్థానిక నగారాకు రంగం సిద్ధమవుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల మూడో వారంలో షెడ్యూల్  విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. మే నెలలో రెండు లేదా మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

author img

By

Published : Apr 3, 2019, 6:43 AM IST

Updated : Apr 3, 2019, 6:54 AM IST

స్థానిక సమరానికి సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం
స్థానిక సమరానికి సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం
రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగియగానే స్థానిక సంస్థల పోరు ప్రారంభం కానుంది. అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించి సన్నద్ధతను సమీక్షించారు. పోలింగ్ సిబ్బంది నియామకం, ఓట్ల లెక్కింపు కేంద్రాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. పంచాయతీల వారీగా ఇప్పటికే ఓటర్ల జాబితాను ప్రకటించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఈసీ అందించింది. ఈ నెల 8వ తేదీన పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రకటించనుంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పుస్తకాల ముద్రణ తుది దశకు చేరింది. ఈ నెల 15వ తేదీ నాటికి అవన్నీ పూర్తి కానున్నాయి.

ఈ నెల 9వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలోపే రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో పాటు పోలింగ్ సిబ్బందిని గుర్తించి నియామక ఉత్తర్వులు అందించాలని ఈసీ ఆదేశించింది. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు అవసరమైన ఏర్పాట్లు చేసి, ప్రతి మండలంలోనూ మూడు కౌంటింగ్ కేంద్రాలు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.

లోక్​సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక ఈ నెల మూడో వారంలో షెడ్యూలు విడుదల చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మే నెలలో రెండు లేదా మూడు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఓట్ల లెక్కింపు మాత్రం లోక్​సభ ఎన్నికల ఫలితాల తరువాతే చేపట్టనున్నారు.

ఇదీ చదవండి:సారు.. కారు.. పదహారు.. సొంత జిల్లాకు కేసీఆర్​

Intro:Hyd_TG_58_26_accident_victim_on_road_sr_nagar_pkg_c28 ....... అందరూ ఉండి కూడా అనాధలయ్యారు తన తమ్మునికి యాక్సిడెంట్ అవ్వడంతో చికిత్స చేయించుకోలేక రోడ్డుపైన నిరీక్షిస్తున్న తన అక్క తమ్ముని చికిత్స కొరకు ఎదురు చూపులు చూస్తూ ఎవరైనా సహాయం చేస్తారని తమను ఆదుకుంటారని గత ఐదు రోజులుగా మండుటెండల్లో పగలనకా రాత్రనకా ఎదురుచూపులు చూస్తు తనకు ,తన తల్లి ,తండ్రి, కి ఎవరు ఎవరైనా సహాయం చేస్తారా అంటూ హైదరాబాద్ నగరంలోని ఎస్సార్ నగర్ బస్ స్టాప్ లో దీనావస్థలో ఉన్న కుటుంబం పై ప్రత్యేక కథనం.... హైదరాబాదులోని స్థానిక ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీ నగర్ లో నివాసం ఉండే ఎం అశోక్ (46) ఎం మేరీ వీరికి సంజన 20 సంవత్సరాల అమ్మాయి inter చదువుతుంది వీరి చిన్న కొడుకు జాన్సన్ 18 సంవత్సరాలు. వీరి తండ్రి అశోక్ ఆల్విన్ కాలనీ లో మాజీ ఉద్యోగి తల్లి మేరి స్థానిక ఆస్పత్రిలో లో నర్సు ఉద్యోగం చేస్తూ మెడికల్ లీవ్ లో ఉంది. వీరి కొడుకు జాన్సన్ స్థానిక మూసాపేటలోని ఒక ద్విచక్రవాహనం షోరూమ్ లో వాష్ బాయ్ గా పని చేస్తున్నాడు.

Body:అయితే గత వారం రోజుల క్రితం జాన్సన్ పనిచేసే షోరూం వద్ద బుల్లెట్ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అతని కాలికి తీవ్రగాయమైంది కానీ త తన తమ్ముడు కి చికిత్స స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న కూడా తన తమ్ముడు కోలుకోలేని స్థితిలో ఉండటంతో, వైద్యం చేయించుకోలేని స్తోమత లేకపోవడంతో ఎటు పాలు పోక పోవడం తో గత నాలుగు రోజుల నుంచి స్థానిక ఎస్సార్ నగర్ బస్ స్టాప్ లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే వీరికి స్థానిక మోతీ నగర్ లో సొంత ఇల్లు ఉన్నా కూడా వారి చిన్నాన్న పెదనాన్నలు తమ ఇంట్లో నుంచి గెంటి వేశారని జాన్సన్ అక్క సంజన తీవ్రమైన ఆవేదనతో తన ఆవేదనను ఈనాడు ఈ టీవీ తో వ్యక్తం చేసింది. స్థానిక chuste చెస్ట్ హాస్పిటల్ నామమాత్రంగా చికిత్స చేశారని తమ తమ్ముడికి ఎవరైనా చికిత్స చేసి ఇ తమను ఆదుకోవాలని జాన్సన్ అక్క సంజన వేడుకున్నారు.. తన తమ్ముడు బాగుపడితే తమ కుటుంబం కూడా బాగు పడుతుందని ఆమె ఈటీవీ తో తన ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక మోతీ నగర్ లో లో తన తండ్రి తరపున తమకు ఇల్లు ఉందని అయితే తన తండ్రి తరఫు బంధువులు తమని ఇంట్లో నుంచి గెంటి వేశారని ఆమె తెలిపారు

Conclusion:ఎవరైనా వచ్చి తమను ఆదుకోవాలని తమ తమ్ముడికి చికిత్స చేయాలని ఈనాడు ఈటీవీ తో వారు ఆవేదన వ్యక్తం చేశారు తమ తమ్ముడికి చికిత్స బాగా చేయాలని ఆమె వేడుకున్నారు తమ్ముడు ఉంటే ఎలాగైనా బతుకుతామని జాన్సన్ అక్క సంజన ఈనాడు వీటితో తన ఆవేదనను వ్యక్త పరిచింది.....bite.. జాన్సన్ తండ్రి అశోక్.... జాన్సన్ అక్క సంజన..... సార్ ఈ ఐటమ్ ను ఈటీవీ తెలంగాణ ,,ఈటీవీ భారత్ కు వాడగలరు... ఈ ఐటమ్ రేపటి ఈనాడు సంచికలో వెలువడుతుంది..... రఘు సనత్నగర్ ఈటీవీ...9490402444
Last Updated : Apr 3, 2019, 6:54 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.