ETV Bharat / state

ఈ-ఎఫ్ఎం.. సందడిగా ఏడాది సంబరం

author img

By

Published : Jul 5, 2019, 8:36 PM IST

పెద్దలు మెచ్చే జానపదాలు, యువతను ఉర్రూతలూగించే పాటలతో శ్రోతలకు చేరువైన ఈ-ఎఫ్ఎం​.. ఏడాది పుర్తి చేసుకుంది.

efm
ఈ-ఎఫ్ఎం.. సందడిగా ఏడాది సంబరం

రామోజీ గ్రూపు సంస్థకు చెందిన ‘ఈనాడు ఎఫ్‌ఎం (ఈ-ఎఫ్‌ఎం)’ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. విభిన్న కార్యక్రమాలతో శ్రోతలను ఆకట్టుకుంటోన్న ఈ- ఎఫ్ఎం వార్షికోత్సవం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరిగింది. ఈ-ఎఫ్​ఎం ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఏడాదిలోనే ప్రజలకు చాలా చేరువయ్యామని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో సరికొత్త కార్యక్రమాలను రూపొందిస్తామని తెలిపారు.

4 కేంద్రాల్లో.. విజయవంతంగా..

తెలుగు రాష్ట్రాల్లో... విజయవాడ, వరంగల్‌, రాజమహేంద్రవరం, తిరుపతిలలో ఈ-ఎఫ్‌ఎం స్టేషన్లు ఏర్పాటు చేశారు. ప్రారంభించి ఏడాది కాకముందే జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించింది. ఇండియన్‌ రేడియో ఫోరం (ఐఆర్‌ఎఫ్‌) ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఎక్సలెన్స్‌ ఇన్‌ రేడియో అవార్డ్సు 2019 ఈ-ఎఫ్‌ఎంను వరించింది. బెస్ట్‌ న్యూలాంచ్‌ ఎఫ్‌ఎం స్టేషన్‌ విభాగంలో సిల్వర్‌ అవార్డు సాధించింది. చర్చావేదికలు, సంగీత అభిమానులకు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సూచనలు, ‘ఆంధ్రా అత్త - తెలంగాణ కోడలు’ వంటి కార్యక్రమాలను రూపొందించింది శ్రోతల అభిమానాన్ని చూరగొంది.

ఇదీ చూడండి: 'ఎర్రమంజిల్​ భవనాల కూల్చివేతపై వివరణ ఇవ్వండి'

Intro:Ap_vsp_77_05_vidyarthulu_rally_av_ap10082

శివ, పాడేరు

నోట్: ap_vsp_76_05_vidyarthulu_rally_av_ap10082. (follow-up)Body:Shiva, paderuConclusion:PAderu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.