పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యను దూరం చేసేలా చూస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టాలని ఆచార్య హరగోపాల్ అన్నారు. ఈ విధానాలను ప్రతిఘటించడానికి విద్యార్థుల తల్లిదండ్రులను సమైక్య పరచాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేయాలని చూస్తుంటే వాటికి వ్యతిరేకంగా విద్యా పరిరక్షణ కమిటీ అనేక నిర్మాణాత్మక ఉద్యమాలు నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పేద ,బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు.
'పేదలకు విద్యను దూరం చేయాలనుకునే చర్యలను తిప్పికొట్టాలి'
కేంద్ర ప్రభుత్వం భారతీయ సంస్కృతి వారసత్వం పేరిట విద్యను కాషాయీకరణ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోందని ఆచార్య హరగోపాల్ ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్ని పటిష్ఠం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు అనే అంశంపై హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యా పరిరక్షణ కమిటీ సదస్సు నిర్వహించింది.