ETV Bharat / state

PRC: విద్యాశాఖ ఒప్పంద, పొరుగు సేవ ఉద్యోగుల పీఆర్సీపై కసరత్తు

కేజీబీవీ, యూఆర్ఎస్, గురుకుల సొసైటీలు, సమగ్ర శిక్ష ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల వేతన సవరణ త్వరలో జరగనుంది. ఇందుకు సంబంధించిన ఫైల్స్​ ఆయా విభాగాల నుంచి సచివాలయానికి చేరాయి.

prc
పీఆర్సీ
author img

By

Published : Jul 29, 2021, 6:56 PM IST

Updated : Jul 29, 2021, 7:59 PM IST

గురుకుల సొసైటీల ఉద్యోగులతో పాటు.. కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల వేతన సవవరణ ఫైల్స్ ఆయా విభాగాల నుంచి సచివాలయానికి చేరాయి. ఇవాళ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి కలిసి చర్చించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల సంక్షేమ శాఖ ఉద్యోగుల వేతన పెంపు ప్రతిపాదనలు ఆర్థిక శాఖ వద్దకు చేరినట్లు టీఎస్ యూటీఎఫ్ నేతలకు అధికారులు తెలిపారు.

గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ ఉద్యోగుల ఫైల్ రెండు, మూడు రోజుల్లో ఆర్థిక శాఖకు పంపిస్తామని ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్ తెలిపినట్లు టీఎస్ యూటీఎఫ్ నేతలు వివరించారు. గురుకుల ఉపాధ్యాయలకు అదనపు వేతనం కూడా ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు కోరారు. పాఠశాల విద్యా శాఖలోని కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష విభాగాల్లో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల వేతనాల్లో 30 శాతం పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా రెండు, మూడు రోజుల్లో ఆర్థిక శాఖకు పంపిస్తామని అధికారులు చెప్పినట్లు టీఎస్ యూటీఎఫ్ నేతలు వివరించారు.

ఇదీ చదవండి: Jagadish Reddy: డిపాజిట్లు కోల్పోతామనే భయంతోనే దళితబంధుపై విమర్శలు

Last Updated : Jul 29, 2021, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.