ETV Bharat / state

2020 కల్లా ఈ-పాస్​పోర్టు సేవలు

పాస్​పోర్టుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ-పాస్​ పోర్టు​లను అందుబాటులోకి తెస్తున్నట్లు హైదరాబాద్​ రీజనల్​ పాస్​ పోర్టు అధికారి విష్ణువర్ధన్​ రెడ్డి తెలిపారు.

author img

By

Published : Jul 13, 2019, 4:27 PM IST

2020 కల్లా ఈ-పాస్​పోర్టు సేవలు: విష్ణువర్ధన్​ రెడ్డి

హైదరాబాద్​ బేగంపేటలోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయంలో జర్నలిస్టులు, వారి కుటుంబాలకు ఏర్పాటు చేసిన పాస్ పోర్టు మేళాను హైదరాబాద్ రీజనల్ పాస్ పోర్టు అధికారి విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఏడాది చివరికల్లా లేదా 2020 ప్రథమార్థంలో ఈ-పాస్ పోర్టు సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని విష్ణువర్ధన్ ప్రకటించారు. ఇందులో చిప్​ ఉన్నందున... పాస్ పోర్టుల దుర్వినియోగం అరికట్టవచ్చు. వెరిఫికేషన్ కూడా వేగవంతం అవుతుందని తెలిపారు. పాస్ పోర్టు జారీ ప్రక్రియ సరళీకృతం చేశామని... గతేడాదితో పోలిస్తే.. ఈ ఆరునెలల్లోనే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయని వివరించారు. ఫేక్ పాస్ పోర్టు ఇండియా వెబ్ సైట్ లపై జాగ్రత్త వహించాలని సూచించారు. ఎన్​ఆర్​ఐ సంబంధిత పాస్ పోర్టు సమస్యలను మా పరిధి మేరకు పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:పంచాయతీ రాజ్​ చట్టంపై కేసీఆర్​ దిశానిర్దేశం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.