ETV Bharat / state

ఈ నెల 19న ప్రారంభంకానున్న దుర్గం చెరువు కేబుల్​బ్రిడ్జి - jubilee hills flyover news

హైదరాబాద్‌కే మకుటాయమానంగా మారనున్న దుర్గం చెరువు వంతెన పనులు పూర్తయ్యాయి. ఎంతో అందంగా, అద్భుతంగా ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఈ నెల 19న నగరవాసులను అందుబాటులోకి రానుంది. దీనితో పాటు జూబ్లీహిల్స్‌ రోడ్డు నెం.45 పైవంతెన సేవలు ప్రారంభం కానున్నాయి.

durgam cheruvu cable bridge to strat from september 19
ఈ నెల 19న ప్రారంభంకానున్న దుర్గం చెరువు కేబుల్​బ్రిడ్జి
author img

By

Published : Sep 17, 2020, 9:28 AM IST

భాగ్యనగరంలోని దుర్గం చెరువుపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తీగల వంతెనను ఈనెల 19న ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ బుధవారం స్పష్టం చేసింది. 20 శతాబ్దపు చిహ్నంగా నిలిచే ఈ వారధితో 5.5 కి.మీ. సాఫీ రోడ్డు అందుబాటులోకి రానుంది. దీంతోపాటు కొత్తగా నిర్మించిన 1.8 కి.మీ. పొడవైన జూబ్లీహిల్స్‌ రోడ్డు నెం.45 పైవంతెన సేవలు అందుబాటులోకి వస్తాయి.

ఫలితంగా రోడ్డు నెం.45 ఫ్లైఓవర్‌ ఎక్కిన వాహనదారుడు కి.మీ. పొడవైన తీగల వంతెన, మైండ్‌స్పేస్‌ కూడలి పైవంతెనల మీదుగా రయ్‌మని మీనాక్షి కూడలి చేరుకోవచ్చు. పక్కనే ఉన్న శిల్పా లేఅవుట్‌లో మొదలైన పైవంతెన పనులు పూర్తయితే వాహనదారులు కేబీఆర్‌ పార్కు నుంచి తీగల వంతెన మీదుగా నిమిషాల వ్యవధిలో గచ్చిబౌలి రింగురోడ్డు చేరుకోవచ్చు.

ఇదీ చూడండి: వైద్యశాఖలో త్వరలో 11 వేల నియామకాలు: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.