ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడకగదుల ఇళ్ల పథకంలో ఇళ్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న రాకేష్‌యాదవ్ అనే వ్యక్తిని ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 17 మందిని మోసం చేసినట్లు పోలీసలు గుర్తించారు.
ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.80 వేల నుంచి లక్షా యాభై వేల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. ఒక అధికారిగా చలామణి అవుతూ తనకి వివిధ జిల్లాల కలెక్టర్లతో సంబంధం ఉందంటూ నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటి వరకు 20 లక్షలు మోసం చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అబిడ్స్ పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి : అమానుషం: చెత్త బండిలో మృతదేహం తరలింపు