నగరంలో ప్రస్తుతమున్న వాయు నాణ్యత ఆరోగ్యరీత్యా ఆందోళనకరంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అన్నారు. హైదరాబాద్ హోటల్ మారియెట్‌లో జరిగిన డాక్టర్స్ ఫర్ క్లీన్ ఎయిర్ మూవ్మెంట్ కార్యక్రమానికి హాజరయ్యారు. క్యాన్సర్లు మొదలు అనేక రకాల రోగాలకు వాయు కాలుష్యం కారణమని... దీనిపై అవగాహనకు వైద్యులు ముందుకు రావడం అభినందనీయమని సీఎస్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమమైన బ్రీత్ లైఫ్ 2030 క్యాంపెయిన్‌కు మద్దతుగా వాయు నాణ్యతను పెంచేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి : తల్లీ రాష్ట్ర ప్రజలందరినీ చల్లంగ చూడమ్మా