రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని... మహిళ ఉన్నతాధికారులకు రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ నేత, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి ప్రశ్నించారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆమె మండిపడ్డారు. కుమురం భీం జిల్లాలో అటవీ శాఖ అధికారిణి అనితపై తెరాస నేత, ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ దాడి చేయడం హేయమైన చర్యని దుయ్యబట్టారు. గాయపడ్డ అధికారిణిని విజయశాంతి పరామర్శించారు. దాడి అమానవీయ, అసాంఘిక చర్యని... అసలు రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఉందా లేదా అనుమానం వస్తోందని విమర్శించారు.
ఇవీ చూడండి : 'మహిళా అధికారిణిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం'