లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికులుకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఒక్కోమనిషికి 12 కిలోల చొప్పున బియ్యం, నగదు పంపిణీ చేస్తోంది. హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్లో ఏర్పాటు చేసిన చౌక దుకాణంలో పెద్ద ఎత్తున వలస కూలీలకు బియ్యం పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
ఇదీ చూడండి: కరోనాపై పోరాటానికి రామోజీ సంస్థల భారీ విరాళం