ETV Bharat / state

చైతన్య సమితి ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ

అంబర్​పేట నియోజకవర్గంలోని సుమారు 200 మంది నిరుపేదలు, వలస కూలీలకు బెస్త గూండ్ల చైతన్య సమితి ఆధ్వర్యంలో పులిహోర ప్యాకెట్లను అందజేశారు.

Distribution of food under the guidance of Chaitanya Samiti
చైతన్య సమితి ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ
author img

By

Published : Apr 11, 2020, 9:01 AM IST

Updated : Apr 11, 2020, 11:06 PM IST

లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో నగరంలో ఎంతోమంది నిరుపేదలు ఉపాధి కోల్పోయి సాయం చేసే చేతుల వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో కొంతమంది తమకు చేతనైన సహాయం చేస్తూ.. వారికి అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో అంబర్​పేట బెస్త గూండ్ల చైతన్య సమితి ఆధ్వర్యంలో అంబర్​పేట నియోజకవర్గంలోని చే నెంబర్, ఆలీ కేఫ్​, గోల్నాక, తిలక్ నగర్, విద్యా నగర్, ముషీరాబాద్​లోని వీఎస్టీ, ఆర్​టీసీ క్రాస్ రోడ్, తదితర ప్రాంతాల్లోని సుమారు 200 మంది నిరుపేదలు, వలస కూలీలకు పులిహోర ప్యాకెట్లను అందజేశారు.

లాక్​డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని చైతన్య సమితి అధ్యక్షుడు సత్య నారాయణ బెస్త పేర్కొన్నారు. వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో చైతన్య సమితి సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్ పొడిగింపుపై రేపు మోదీ ప్రకటన!

Last Updated : Apr 11, 2020, 11:06 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.