లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీలు, చిరు ఉద్యోగులకు తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం అండగా నిలిచింది. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో నివసిస్తున్న సుమారు 200 మంది నిరుపేదలకు సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
వివిధ జిల్లాలోని పేదలకు సైతం తమ సంఘం తరఫున సరుకులు పంపిణీ చేస్తామని సంఘం అధ్యక్షులు గంధం రాములు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో రోజు గడవడం కష్టంగా ఉన్న పేదలు, దినసరి కూలీలు, వివిధ ప్రైవేటు సంస్థల్లో పని చేసే చిరు ఉద్యోగులకు తమ వంతుగా నిత్యావసరాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో 644కు చేరిన కరోనా కేసులు