శంషాబాద్ వద్ద హత్యాచారానికి గురైన ‘దిశ’పై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న మరో యువకుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గుంటూరు జిల్లా కొత్తపేట్ ఆర్టీసీ కాలనీకి చెందిన కాకుమాను అమర్నాథ్గా గుర్తించారు. పదో తరగతి చదువు పూర్తి చేసి... గత రెండేళ్లుగా మెడికల్ షాపులో అతడు పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై సైబర్ నేరాలకు చెందిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఇవీచూడండి: దిశ కేసులో కీలక ఆధారాలు.. సూపర్ లైట్‌తో గుర్తింపు