సమాజంలో శాంతి, భద్రతల పరిస్థితి పటిష్ఠంగా ఉంటేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని.. దీనికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రమని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖ ఆధునీకరణకు, పటిష్ఠతకు అందిస్తున్న ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితి పటిష్ఠంగా ఉందని డీజీపీ తెలిపారు.
పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు రాష్ట్రంలోని మహిళలు, యువతకు వెబ్ ఆధారిత చైతన్య సదస్సు నిర్వహించారు. సింబయాసిస్ న్యాయ విశ్వవిద్యాలయం సహకారంతో నెల రోజులపాటు నిర్వహించిన సదస్సుల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కొవిడ్ - 19 నేపథ్యంలో ఇంటర్నెట్ వినియగించే మహిళలు, పిల్లలు సంఖ్య పెరిగిందని.. ఈ సందర్బంగా వీరు సైబర్ నేరాల బారిన పడకుండా సైబ్-హర్ పేరుతో కార్యక్రమాన్ని దేశంలోనే తెలంగాణ పోలీస్ మొట్టమొదటి సారిగా నిర్వహించిందని డీజీపీ పేర్కొన్నారు. ఇందులో దాదాపు 50 లక్షల మంది పాల్గొనడం గొప్ప విషయమని చెప్పారు.
ఇదీ చూడండి: గల్వాన్ లోయ యోధులకు శౌర్య పతకం!