DGP LEAVE: రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి.. రెండు వారాల పాటు మెడికల్ లీవ్ తీసుకున్నారు. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4 వరకు మహేందర్ రెడ్డి సెలవులో ఉంటారు. అప్పటి వరకూ ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న అంజనీకుమార్ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన వచ్చేవరకు పూర్తి అదనపు బాధ్యతలను అంజనీకుమార్ చేపట్టనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.
ఇదీ చూడండి: KTR on PM Modi: 'నమో అంటే... నమ్మించి మోసం చేయడం'