రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి.. మహేందర్‌రెడ్డి అత్యధిక కాలం డీజీపీగా పనిచేశారు. ఐపీఎస్‌గా 36 ఏళ్లపాటు సుదీర్ఘ సేవలందించారు. పోలీసుశాఖలో సాంకేతికతతో కూడిన విప్లవాత్మక మార్పులను డీజీపీ మహేందర్‌రెడ్డి తీసుకొచ్చారు.
నూతన డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. అంజనీకుమార్ గతంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, అవినీతి నిరోధక విభాగాధిపతిగా పనిచేశారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా.. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగానూ అంజనీకుమార్ సేవలు అందించారు.
ఇవీ చదవండి: న్యూఇయర్ వేళ.. భాగ్యనగరంలో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు
కొత్త ఏడాదికి భద్రతా సవాళ్ల స్వాగతం.. సైబర్ సైనికులు అవసరమే..!