నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా విడుదలైన నిధుల మంజూరు పత్రాలను సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ఆయన అందించారు.
సికింద్రాబాద్ క్యాంపు కార్యాలయంలో రూ.3 లక్షల విలువజేసే ఎల్వోసీ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆ యాప్ల ద్వారా వాయిస్ కమాండ్తో డ్రైవింగ్!