సూపర్ స్పైడర్ల(super spiders) కోసం.. హైదరాబాద్, సీతాఫల్మండీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీకా శిబిరాన్ని ఉప సభాపతి పద్మారావు గౌడ్ (deputy speaker) ప్రారంభించారు. రానున్న 10 రోజుల్లో.. నగర వ్యాప్తంగా 3 లక్షల మందికి ఉచితంగా టీకాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి నివారణ చర్యలను అత్యంత పకడ్బందీగా చేపడుతోందని పద్మారావు పేర్కొన్నారు. మహమ్మారి వల్ల ప్రజా జీవితం అల్లకల్లోలంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రాధాన్యత కల్పించాల్సి వస్తోందని వివరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, నగర ఉప కమిషనర్ మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు.. హేమ, సునీతా, లక్ష్మీ ప్రసన్న, శైలజ, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 2 DG drug: 2-డీజీ డ్రగ్ ధర ఎంతంటే!