తెలంగాణ ఐకాస నేత ఆవుల బలరాం ఆకస్మిక మరణం తీవ్ర ఆవేదన కలిగించిందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, సహచరులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బలరాం ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక సందర్భాల్లో బలరాం వెన్నుదన్నుగా నిలిచారని పద్మారావు గుర్తు చేశారు. ఆయన చూపిన స్ఫూర్తి ఎంతో గొప్పది అని కొనియాడారు.
ఇదీ చదవండి: రైతు వేదికల నిర్మాణంతో కొత్తశకం... నేడు ప్రారంభించనున్న సీఎం