ETV Bharat / state

ఇంటింటి సర్వే.. మూడున్నర లక్షల మందిలో లక్షణాలు

కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు... సత్ఫలితాలిస్తున్నాయని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇంటింటి సర్వే, ప్రత్యేక ఓపీతో మూడున్నర లక్షల మందిలో కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. భారీగా బిల్లులు వేసిన ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని... అవసరమైతే అనుమతుల రద్దుకూ వెనుకాడమని హెచ్చరించింది. కేంద్రం నుంచి కొవాగ్జిన్‌ డోసులు త్వరలోనే వస్తాయని... రాగానే రెండోడోసు వారికీ తప్పక అందజేస్తామని స్పష్టం చేసింది.

department-of-health-says-covid-symptoms-in-three-and-a-half-lakh-people-in-hyderabad
ఇంటింటి సర్వే.. మూడున్నర లక్షల మందిలో లక్షణాలు
author img

By

Published : May 19, 2021, 6:39 AM IST

ఇటీవలి ఆరోగ్య సర్వే, కొవిడ్‌ ఓపీ విధానాల ద్వారా 3.54 లక్షల మందిలో కరోనా లక్షణాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ ఔషధ కిట్లను అందజేసింది. పరీక్షలు నిర్వహించి, కరోనా వైరస్‌ సోకినట్లుగా నిర్ధారించకపోయినా.. వీరందరిలోనూ జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం తదితర ఏదొక కొవిడ్‌ లక్షణం ఉండటాన్ని గమనించింది. ఈ క్రమంలో కిట్లు అందుకున్న వారందరినీ 14 రోజుల పాటు వైద్యసిబ్బంది నిత్యం పరిశీలన చేస్తున్నారని, ఎవరిలోనైనా ఆరోగ్యం విషమిస్తున్నట్లు గుర్తించగానే.. వెంటనే 108 అంబులెన్సులో సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారని వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది.

ఫిర్యాదులుంటే ఫోన్ చేయండి..

రెండు వారాలుగా రాష్ట్రంలో కొవిడ్‌ తగ్గుముఖం పట్టిందని ప్రకటించింది. ‘‘కొవిడ్‌ కట్టడిలో పరీక్షల కంటే ముందస్తు చికిత్స ముఖ్యమని తెలంగాణ ప్రభుత్వం తొలుత గుర్తించి ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇంటింటి సర్వే ద్వారా దేశానికే రాష్ట్రం మార్గదర్శకంగా నిలిచింది. ఇప్పుడు కేంద్రం కూడా దాన్నే అమలుచేయాలని సూచించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు, వసతులు, అన్ని రకాల ఔషధాలు పూర్తి ఉచితంగా అందజేస్తున్నాం. అయినా, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఔషధాలను కూడా బయటకు రాస్తున్నారని, రూ.లక్షల్లో బిల్లులు వేస్తున్నారని రోగులు, బంధువులు ఫిర్యాదు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో మానవతతో వైద్యమందించాలని ప్రైవేటు ఆసుపత్రులను కోరుతున్నాం. వాటిపై రెండోదశలో 9154170960 నెంబరుకు 26 ఫిర్యాదులొచ్చాయి. ఇంకెవరికి సమస్యలున్నా ఈ నంబరుకు ఫోన్‌ చేయొచ్చు. నిబంధనలను ఉల్లంఘించినట్లుగా రుజువైన మాదాపూర్‌కు చెందిన ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కొవిడ్‌ సేవల నిర్వహణను ఇప్పటికే రద్దుచేశాం. సికింద్రాబాద్‌, నాగోల్‌, బషీర్‌బాగ్‌లో ఉన్న మరో మూడు ఆసుపత్రులకు నోటీసులిచ్చాం. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినట్లుగా తేలితే.. ఆయా ఆసుపత్రుల అనుమతుల రద్దుకూ వెనుకాడం.

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో..

రాష్ట్రంలో తొలిదశకు, మలిదశకు మధ్య మౌలిక వసతులు పెంచుకున్నాం. త్వరలోనే వరంగల్‌, ఆదిలాబాద్‌ల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో 604 పోస్టులను వెంటనే ఒప్పంద, పొరుగు సేవల్లో భర్తీచేయడానికి ప్రభుత్వం అనుమతించింది. మన ఆసుపత్రిల్లోనే ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసుకునే దిశగా చర్యలు ప్రారంభించాం. గాంధీ, కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో మొత్తం 50 మంది బ్లాక్‌ఫంగస్‌ బాధితులున్నారు. బయట ఆసుపత్రుల్లోనూ మరో 30-40 మంది కనిపిస్తున్నారు. వ్యాధికి వాడే మందులను విచ్చలవిడిగా రాస్తున్నారు. అందుకే నిపుణుల కమిటీని వేసి, మార్గదర్శకాలు రూపొందించాం. ఎవరికి అవసరమో కమిటీ పరిశీలించి ఔషధాలకు అనుమతిస్తుంది. ఇకపై వీటిని అనుసరించే బ్లాక్‌ఫంగస్‌కు చికిత్స అందించాల్సి ఉంటుంది. మధుమేహం నియంత్రణలో లేనివారు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో బ్లాక్‌ఫంగస్‌ అవకాశాలు అధికం. ఇది అంటువ్యాధి కాదు. వాతావరణంలో ఉండే ఫంగస్‌ శరీరం బలహీనమైనప్పుడు దానిపై దాడిచేస్తుంది. అందుకే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, కొవిడ్‌ చికిత్స పొందినవారు తప్పక మాస్కు ధరించాలి. జ్వరం, జలుబు, నలుపు రంగు స్రావాలు, ముఖంపై నొప్పి, దవడ పళ్లలో నొప్పి వంటి లక్షణాలుంటే ఈఎన్‌టీ వైద్యుల్ని సంప్రదించాలి. ఎండోస్కోపీ ద్వారా ఫంగస్‌ ఉనికి తెలిసిపోతుంది’’ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి వెల్లడించారు.

రాష్ట్రాల వారీగా వివరాలు

అసత్య ప్రచారం.. హానికరం

"సామాజిక మాధ్యమాల్లో లక్షల మందిని ప్రభావితం చేసే అంశాలపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో అనవసర ఆందోళన పెంచుతున్నారు. బ్లాక్‌ ఫంగస్‌పై కొన్ని టీవీ ఛానళ్లలో భయం కలిగించే దృశ్యాలకు నేపథ్య సంగీతాన్ని జోడిస్తూ ప్రసారం చేస్తున్నారు. ఇలాంటివి చూడడం వల్ల గుండెజబ్బులున్నవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, పిల్లల్లో అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. దయచేసి సామాజిక బాధ్యతగా భావించి సంయమనం చూపండి. పొరపాట్లుంటే తప్పకుండా ప్రసారం చేయండి."

టీకాలొచ్చాకే మళ్లీ ప్రారంభం

"కొవిడ్‌ టీకాలను కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు అందజేస్తోంది. 45 ఏళ్లు పైబడిన వారిలో అర్హులకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. 18-44 ఏళ్ల మధ్యవయస్కులకు టీకాలను రాష్ట్రప్రభుత్వమే కొనాల్సి ఉంటుంది. అలా చేయాలన్నా వ్యాక్సిన్లను కేంద్రమే కేటాయించాలి. ఇప్పటి వరకూ 45 ఏళ్లు పైబడినవారి కోసం 57,30,220 డోసుల టీకాలొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొన్నవి 4.90 లక్షలు. రాష్ట్రంలో 18-44 ఏళ్ల మధ్యవయస్కుల్లో అర్హులు 1.90 కోట్ల మందికి పైనే ఉన్నారు. తగినన్ని లేకుండా ఈ కేటగిరీ వారికి టీకాలు మొదలుపెడితే.. గందరగోళం ఏర్పడొచ్చు. అందుకే టీకాలు సమృద్ధిగా వచ్చాకే ఆ విభాగంలో పంపిణీని ప్రారంభిస్తాం. ఇక 45 ఏళ్లు దాటినవారికి రెండోడోసు విషయంలోనూ మార్గదర్శకాలు మారాయి. కొవిషీల్డ్‌ టీకా తొలిడోసు తీసుకున్నవారు ఇప్పుడు 12 వారాల తర్వాత రెండోది పొందాల్సి ఉంటుంది. దీంతో ఈ టీకా రెండోడోసు లబ్ధిదారులు ఇప్పుడు రాష్ట్రంలో ఎవరూ లేరు. కొవాగ్జిన్‌ టీకా తొలిడోసు పొంది 4 వారాలు పూర్తయి, రెండోడోసు పొందాల్సిన వారు రాష్ట్రంలో 3 లక్షల మంది ఉన్నారు. కానీ, ఈ టీకాల లభ్యత రాష్ట్రంలో ప్రస్తుతం 50వేల డోసులే. వీటిని ఇవ్వాలన్నా సరిపోను లేవు. కేంద్రం నుంచి కొవాగ్జిన్‌ డోసులు త్వరలోనే వస్తాయి. రాగానే రెండోడోసు వారికీ తప్పక అందజేస్తాం. టీకాల కొరతను అధిగమించడానికి ‘గ్లోబల్‌ టెండర్‌’ విధానానికి వెళ్తున్నాం. వ్యాక్సిన్‌ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2500 కోట్లు కేటాయించింది. ఎవరూ ఆందోళన చెందవద్దు."

ఇదీ చూడండి: 'బ్లాక్​ఫంగస్​ నిర్మూలనకు సర్కారు అన్ని చర్యలు తీసుకుంటోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.