రాష్ట్రంలో వేసవి తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. వచ్చే నెల 12 నుంచి.. అందుకు అనుమతించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కరోనా కారణంగా మూతపడ్డ పాఠశాలలు.. ఇటీవలే తెరుచుకున్నాయి. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు మాత్రమే ప్రత్యక్ష బోధన కొనసాగుతోంది.
తొమ్మిది, పదో తరగతులకు మే 21 వరకు విద్యా సంవత్సరం కొనసాగుతుందని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు తరగతులు ఎప్పటి వరకు నిర్వహిస్తారో స్పష్టం చేయకపోగా.. ప్రభుత్వం వారికి పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటిపై ఓ నిర్ణయం వెలువడనుంది.
ఇదీ చదవండి: ప్రజల పురోగతికి కట్టుబడి.. దేశానికే ఆదర్శంగా నిలిచాం: గవర్నర్