నిజామాబాద్ జిల్లా బోధన్ సరస్వతీనగర్ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మున్సిపల్ అధికారులు ఆర్టీసీ డిపో ప్రహరీ గోడను కూల్చేందుకు ప్రయత్నించారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గోడను ఎలా కూలుస్తారని.. ఆర్టీసీ ఉద్యోగులు పనులను అడ్డుకున్నారు.
తాము మరో గోడను కట్టుకున్న తరువాతే.. దీనిని కూల్చాలని... ఆర్టీసీ అధికారులు గతంలోనే మున్సిపల్ సిబ్బందికి తెలిపారని కార్మికులు చెబుతున్నారు. కనీసం ముందే కూల్చుతున్నట్లు చెప్పినా... వేరే మార్గాలు చూసుకునేవాళ్లమని పేర్కొన్నారు. డిపోలో బస్సులకు సంబంధించిన పనిముట్లు, స్పేర్ పార్ట్స్ అన్ని ఉంటాయని... వాటిని ఎవరైనా తీసుకెళ్లిపోతే ఎవరిది బాధ్యత అంటూ మండిపడ్డారు.
ఇవీ చూడండి: భాగ్యనగరంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు