ETV Bharat / state

ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు

Deadline for GHMC Election Nominations Expired
ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు
author img

By

Published : Nov 20, 2020, 3:00 PM IST

Updated : Nov 20, 2020, 3:39 PM IST

14:59 November 20

ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు

జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. మూడురోజులపాటు నామినేషన్లను స్వీకరించారు అధికారులు. ఇవాళ అత్యధికంగా 600కిపైగా నామినేషన్లు వచ్చినట్లు సమాచారం. నామినేషన్లు వేసిన అభ్యర్థులతో జోనల్ కమిషనర్ కార్యాలయాలు కిటకిటలాడాయి.  

నిన్నటివరకు 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్ల దాఖలు చేశారు. మొత్తం నామినేషన్ల సంఖ్య 1,000కిపైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  

రేపు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగనుంది. ఈనెల 22న మధ్నాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితా ప్రకటిస్తారు. ఫారం-ఏ ఇచ్చేందుకు గడువు ముగిసింది. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు ఫారం-బి సమర్పించేందుకు అవకాశం ఉంది.  

ఇవీచూడండి: 'జీహెచ్ఎంసీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై చర్యలు'

Last Updated : Nov 20, 2020, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.