ETV Bharat / state

కరోనా దెబ్బ: ఉపాధి కోల్పోతున్న డ్యాన్స్​ మాస్టర్లు

కరోనా మహమ్మారి అందరి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. కూలీ పని చేసుకునే వారినుంచి సగటు ప్రైవేట్ ఉద్యోగుల వరకు సైతం ఉపాధి లేకుండా చేస్తోంది. హైదరాబాద్​లో డ్యాన్స్​ అకాడమీలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. సమ్మర్​లో ప్రత్యేక క్యాంపుల ద్వారా శిక్షణనిచ్చే డ్యాన్స్​ మాస్టర్లు తమ జీవనోపాధి కోల్పోయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

dance masters l
ఉపాధి కోల్పోతున్న డ్యాన్స్​ మాస్టర్లు
author img

By

Published : May 8, 2021, 8:01 PM IST

ఛాయ్ బండి నుంచి స్టార్ హోటల్స్ వరకు... రోజు వారి కూలీ నుంచి సగటు ఉద్యోగి వరకు ఇలా కరోనా మహ్మమారి ఎవరినీ వదలడం లేదు. ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. హైదరాబాద్​లో ప్రతి ఏటా సమ్మర్​ క్యాంపు ఏర్పాటు డ్యాన్స్​ మాస్టర్ల ఉపాధిని దెబ్బతీసింది. ప్రతిరోజు రెండు, మూడు క్లాసులు చెప్పినా 300 మందికి డ్యాన్స్ శిక్షణ ఇచ్చే డ్యాన్స్ మాస్టర్లు కూడా ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు.

dance school
డ్యాన్స్​ నేర్చుకుంటున్న చిన్నారులు

నగరంలోని చందానగర్, మణికొండ, బీరంగూడ ప్రాంతాల్లో డ్యాన్స్ శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసి ఉపాధి పొందే ఓ నిర్వాహకుడు కరోనాతో రెండేళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నారు. మాట్లాడుతూ కరోనా తీవ్రత తగ్గింది అనుకునేలోపే కరోనా రెండో దశ వచ్చి తమ ఉపాధిని దెబ్బ తీసిందని డాన్స్ మాస్టర్ రఘు వాపోతున్నారు. క్లాసుకు నలుగురు విద్యార్థులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి శిక్షణ కోసం తీసుకున్న బిల్డింగ్ కిరాయి కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నామని తన బాధను వెలిబుచ్చారు.

ఇదీ చూడండి: కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి: హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.