ETV Bharat / state

Dak Awards 2021: అంకితభావానికి చిరునామా తపాలాశాఖ: సీఎస్ - news in telangana

Dak Awards 2021
డాక్‌ సేవ అవార్డులు- 2021
author img

By

Published : Oct 18, 2021, 8:55 AM IST

06:45 October 18

డాక్‌ సేవ అవార్డులు- 2021

కొవిడ్‌ క్లిష్ట పరిస్థితుల్లోనూ అనుకున్న లక్ష్యాలను సాధించి తపాలా అధికారులు వృత్తి పట్ల అంకితభావానికి చిరునామాగా నిలిచారని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ప్రశంసించారు. తపాలా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆసరా పింఛను నగదుతో పాటు 29,794 పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయడం గొప్ప విషయమన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ‘డాక్‌ సేవ’ అవార్డులు- 2021 ప్రదానోత్సవంలో సీఎస్‌ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం తపాలా శాఖకు సహకారం అందిస్తుందని చెప్పారు. 

అవార్డు గ్రహీతలు

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్రానికి చెందిన పోరాట యోధులు కుమురంభీం, చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్‌ పేరిట ప్రత్యేక కవర్లు విడుదల చేయడం హర్షణీయమని తెలిపారు. తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ ఎస్‌.రాజేందర్‌కుమార్‌, హైదరాబాద్‌ ప్రాంతీయ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పి.వి.ఎస్‌.రెడ్డి, ప్రధాన కార్యాలయ ప్రాంత పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ టి.ఎం.శ్రీలత, తపాలా సేవల సంచాలకుడు కె.ఎ.దేవరాజ్‌ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: నదిలో కొట్టుకుపోయిన రెండంతస్తుల భవనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.