ట్రాన్స్‌జెండర్లకు సమాజంలో సరైన గుర్తింపు లేదని.. సమాజంలో వారికి సుముఖత స్థానం కోసం సైబరాబాద్ పోలీసులు కృషి చేస్తున్నారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌ను సజ్జనార్ ప్రారంభించారు. ఈ డెస్క్ ద్వారా ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు, ప్రభుత్వం నుంచి లభించే సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు.
ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎస్సీఎస్సీ ముందుకు రావడం అభినందనీయమని సజ్జనార్ పేర్కొన్నారు. కాగ్నిజెంట్‌తో పాటు పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో 18 మంది ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్ రావు, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ సాకేత్, ఎస్సీఎస్సీ అధ్యక్షుడు వేదుల కృష్ణ, సైబరాబాద్ షీ టీమ్స్ ఇన్ఛార్జ్ డీసీపీ అనసూయ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది: మంత్రి ఎర్రబెల్లి