ETV Bharat / state

పోలీసుల ఎత్తులకు పైఎత్తులు - బురిడీ కొట్టిస్తూ కోట్లు కొల్లగొడుతున్న సైబర్‌ మోసగాళ్లు - తెలంగాణలో సైబర్ నేరాలు

Cyber Frauds In Hyderabad : రాష్ట్రంలో సైబ‌ర్ నేరాల‌ సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. సైబర్‌ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన క‌ల్పిస్తున్నా బాధితుల సంఖ్య పెరుగుతుందే కానీ త‌గ్గడం లేదు. పోలీసుల నిఘా పెరగడంతో నేరస్థులు సైతం పంథాలు మార్చుకుని మరీ మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసుల వేస్తున్న ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న కేటుగాళ్లు ఆచూకీ తెలియకుండా తప్పించుకుంటున్నారు.

Cyber Criminals Cheated Software Employees In Hyderabad
Cyber Frauds In Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2023, 3:01 PM IST

Cyber Frauds In Hyderabad : భాగ్యనగరంలో నిరుద్యోగంతో పాటు అంతంత సంపాదనతో ఇబ్బంది పడుతున్న కొందరు ఆన్‌లైన్‌లో ఉద్యోగ ప్రకటన కనిపించగానే నమ్మేస్తున్నారు. వర్క్‌ఫ్రమ్‌ హోంతో ఇంట్లోనే ఉండొచ్చొనే ఉద్దేశంతో లక్షల వేతనం తీసుకుంటున్న ఐటీ నిపుణులు అదనపు ఆదాయం కోసం ఆశపడుతున్నారు. అలా పదవ తరగతి కూడా పాస్ కానీ కేటుగాళ్ల చేతిలో మోసపోతున్నారు.

ఈ కేటుగాళ్లు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, పెట్టుబడులు, బహుమతులు, విదేశీ సంబంధాల పేరిట ఉన్నత విద్యావంతులను బురిడీ కొట్టిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. కేసులు, అరెస్ట్‌లు, జైళ్ల నుంచి తప్పించుకునేందుకు ముఠాలు కొత్తమార్గాలు ఎంచుకుంటున్నాయి. ఆనవాళ్లు బయటపడకుండా పోలీసులను ఏమార్చుతూ చాకచక్యంగా తప్పించుకుంటున్నట్టు ఇటీవల సైబర్‌క్రైమ్‌ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

67కోట్ల మంది డేటా ఒక్కడే చోరీ చేశాడా..! అసలు నిందితులు ఎవరు?

Cyber Criminals Cheated Software Employees In Hyderabad : హైదరాబాద్‌ టోలిచౌకిలో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సంపాదన ఏడాదికి 20లక్షలు. ఆన్​లైన్​లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ అనే లింక్ కనిపించగానే ఆశపడ్డారు. ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నాం కదా కేవలం గంట సమయం కేటాయిస్తే రోజూ 2000 అని ఉండటంతో ఎలా చూసినా నెలకు 60వేలు చేతికి రావటం పక్కా అనుకున్నారు. అంతే ఉద్యోగం, పెట్టుబడి అనగానే ఆశపడి 12లక్షలు పోగొట్టుకున్నారు.

మరోవైపు నారాయణగూడకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి నిర్వాణ డిజిటల్‌ పేరుతో టెలిగ్రామ్‌ లింక్‌తో పెట్టుబడి పెడితే అసలు, లాభం, బోనస్‌ అంటూ 10,000 మొదటి వాయిదా కట్టించుకున్నారు. టాస్క్‌లు ఇస్తూ విజేతగా నిలిచారంటూ కొంత నగదు ఖాతాలో జమచేసి నమ్మకం కలిగించిన సైబర్‌క్రైమ్‌ కేటుగాళ్లు 5లక్షలు కాజేసి టెలిగ్రామ్‌ ఖాతాను బ్లాక్‌ చేశారు. ఇవే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఈ సైబర్‌ మోసగాళ్లు చదువుకున్న వారిని బురిడికొట్టిస్తున్నారు.

సైబర్​బాద్​ పోలీస్​ ఇక్కడ.. ట్రెండ్​ ఫాలో అవ్వరు.. సెట్​ చేస్తారు

Cyber Criminals : రాజ స్థాన్, గుజరాత్, హరియణా, పశ్చిమబెంగాల్, జార్కండ్‌ తదితర రాష్ట్రాల్లో వందలాది సైబర్‌ ముఠాలు ఉన్నాయి. వీరిలో ఎవరెంత మందిని మోసగిస్తున్నారు? ఎంత ఎక్కువగా సంపాదిస్తున్నారనే దానిపై విపరీతమైన పోటీ ఉంటుంది. కొత్తగా మాయా ప్రపంచలోకి వచ్చే యువకులకు శిక్షణ ఇచ్చేందుకు సంస్థలు సైతం వెలిశాయి. కొద్దికాలం వరకు ఈ ముఠాలు నకిలీ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి సేకరించిన డేటా ఆధారంగా ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడేవారు.సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు, అంతర్జాలం ఐపీ అడ్రస్‌ ఆధారంగా పోలీసులకు తమ ఆనవాళ్లు తెలుస్తున్నాయనే ఉద్దేశంతో వాటిని మూసివేశారు.

కార్లు, డీసీఎంలను కొనుగోలు చేసి వాటినే మొబైల్‌ కాల్‌ సెంటర్లుగా మార్చుతున్నారు. కొందరు కొండలు గుట్టపైకి వెళ్లి మరీ నేరాలకు పాల్పడి ఫోన్లను అక్కడే ఉంచేసి ఇంటికి వస్తున్నారు. ఇలా చేయడం వల్ల పోలీసులకు నేరగాళ్ల ఆచూకీ గుర్తించడం కష్టంగా మారుతోంది. మోసాల భారీన పడకుండా ఉండేందుకు గుర్తు తెలియని, సంబంధం లేని లింకులు క్లిక్‌ చేయకపోవటం మంచిదని పోలీసులు చెబుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల పేరిట ప్రకటనలను స్పందించకపోవటమే ఏకైక మార్గమని సైబర్‌క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు.

Hyderabad Police Arrested Cyber Gang : సైబర్‌ మోసాల్లో 'ఉగ్ర' లింకుల కలకలం

Cyber Crime Gangs Arrest : హలో.. అంటూ అందినకాడికి దోచేస్తున్న ముఠాలు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.