స్నేహితురాలికి సహాయం చేయబోయి రూ.96 వేలు యువకుడు మోసపోయిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. తన స్నేహితురాలికి రూ.2 వేలు గూగుల్ పే ద్వారా ఫర్వేద్ పంపారు. నగదు జమ కాలేదని కస్టమర్ కేర్ నెంబర్ కోసం ఫర్వేద్ గూగుల్‌లో వెతికారు.
ట్రాన్సాక్షన్ పూర్తి కావాలంటే ఎనిడెక్స్ అనే యాప్‌ను సైబర్ నేరగాళ్లు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఈ క్రమంలో యాప్ ద్వారా రూ.25 పంపిస్తే, సైబర్ నేరగాళ్లు మరలా పంపిస్తామని సూచించారు. ఈ నేపథ్యంలో రూ. 25 పంపగా అదే అదునుగా భావించి మరో 4 ఓటీపీల ద్వారా రూ.96 వేలను సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.