ETV Bharat / state

'ప్రస్తుతం టీఎస్​–బీపాస్ బిల్లు ప్రయోగాత్మకంగానే అమలు చేస్తున్నాం' - టీఎస్​–బీపాస్

టీఎస్​–బీపాస్ బిల్లు ప్రస్తుతం ప్రయోగాత్మకంగా మాత్రమే అమలు చేస్తున్నామని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడించారు. టీఎస్​–బీపాస్​కు సంబంధించిన సాఫ్ట్ వేర్​ అప్లికేషన్ ప్రస్తుతం పురోగతిలో ఉందని ఆయన తెలిపారు.

Hyderabad latest news
Hyderabad latest news
author img

By

Published : May 30, 2020, 10:57 PM IST

టీఎస్​–బీపాస్ బిల్లును ప్రస్తుతం రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా మాత్రమే అమలు చేస్తున్నామని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తర్వాతే పూర్తి స్థాయిలో ఈ బిల్లు అమల్లోకి వస్తుందన్నారు. కొత్త మున్సిపల్​ చట్టం–2019లో పట్టణ ప్రణాళికలు, భవన నిర్మాణ, లేఔట్​ అనుమతులు స్థానిక సంస్థలే నిర్వహించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.

టీఎస్​–బీపాస్​కు సంబంధించిన సాఫ్ట్ వేర్​ అప్లికేషన్ ప్రస్తుతం పురోగతిలో ఉందని ఆయన వెల్లడించారు. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య అనుసంధాన ప్రక్రియతో పాటు ప్రభుత్వ స్థలాలు, నిషేధిత సర్వే నంబర్ల వివరాలు తదితర అంశాలను పొందుపరిచే ప్రక్రియ ఇంకా పురోగతిలో ఉందన్నారు. వాటి తర్వాతే టీఎస్​-బీపాస్​ బిల్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని అరవింద్ కుమార్​ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.