ETV Bharat / state

ఉస్మానియాలో హరితహారంపై సీఎస్ సమీక్ష

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ మొక్కలు నాటారు. అక్కడ అమలవుతున్న హరితహారం కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు.

CS somesh kumar visits osmania university personally
ఉస్మానియాలో హరితహారంపై సీఎస్ సమీక్ష
author img

By

Published : Nov 3, 2020, 8:05 PM IST

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ వ్యక్తిగతంగా సమీక్షించారు. అధికారులతో కలిసి వివిధ ప్రదేశాలను సందర్శించి మొక్కల పెంపకం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

విశ్వవిద్యాలయ ఉపకులపతి నివాస ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఎల్లప్పుడు పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉస్మానియా చరిత్రలోనే పెద్దఎత్తున హరితహారం చేపట్టడం మొదటిసారని ఓయూ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పురపాలక ప్రధాన కార్యదర్శి అరవింద్​కుమార్, ఇన్​ఛార్జ్​ వీసీ, జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేశ్​ ​కుమార్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఈనెల 13 తర్వాత ఎప్పుడైనా జీహెచ్​ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్​ : ఎస్​ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.