ETV Bharat / state

ఆ ప్రాంతాలు పట్టణాలుగా రుజువైతే ఇంటికి రూ.1.50 లక్షలు - లేకుంటే రూ.72వేలే - PMAY SCHEME HOUSE IN TELANGANA

పట్టణ ప్రాంతాలుగా నమోదైతే ఒక్కో ఇందిరమ్మ ఇంటికి రూ.1.50 లక్షలు - లేదంటే రూ.72 వేలే - త్వరలో నిర్ణయం తీసుకోనున్న కేంద్రం

Telangana Govt Focus on PMAY Scheme Fund
Telangana Govt Focus on PMAY Scheme Fund (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2025, 3:34 PM IST

Telangana Govt Focus on PMAY Scheme Fund : పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం అందించే నిధులపై సర్కార్‌ దృష్టి సారించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన - అర్బన్‌ (పీఎంఏవై-యూ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి నిధులు అందిస్తోంది. పట్టణాల్లో రూ. 1.50 లక్షలు, గ్రామాల్లో రూ.72వేల చొప్పున లబ్ధిదారులకు అందిస్తోంది.

రాష్ట్రంలో మొత్తం 28 అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (యూడీఏ)లు ఉండగా, ఇందులో గతేడాది అక్టోబరులో ఏర్పాటు చేసినవి 19 ఉన్నాయి. పాత యూడీఏలు మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ (శాతవాహన), సిద్దిపేట, నిజామాబాద్‌, స్తంభాద్రి(ఖమ్మం), వేములవాడలను ప్రభుత్వం మరింత విస్తరించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలుండగా 11,492 (90శాతం) గ్రామాలు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి చేరాయి.

కేంద్రమంత్రిని కోరిన రాష్ట్ర ప్రభుత్వం : ఈ క్రమంలో కొత్త ఏర్పాటైన యూడీఏలను కూడా పట్టణ ప్రాంతాలుగా పరిగణించి వాటి పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లకు రూ.1.50 లక్షల చొప్పున అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు కూడా ఈ విషయాన్ని విన్నవించింది.

PMAY అర్బన్ 2.0 స్కీమ్ కింద కోటి ఇళ్లు మంజూరు​ - అర్హులెవరు? ప్రయోజనాలు ఏంటి? - Pradhan Mantri Awas Yojana

కేంద్రం ఇళ్ల కోసం ఇచ్చే నిధులు అందాలంటే పీఎంఏవై పోర్టల్‌లో లబ్ధిదారుల లిస్టు పెట్టాలి. ఇప్పటికే సదరు పోర్టల్‌ లాగిన్‌ కోసం అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. లబ్ధిదారుల వివరాలు వారే నమోదు చేస్తారు. పంచాయతీలకు సంబంధించి గ్రామ కార్యదర్శుల పేర్లను అందించారు. ప్రస్తుతం కేంద్రం పాత 9 యూడీఏలను మాత్రమే పట్టణాలుగా గుర్తించి పథకం కింద నిధులు ఇస్తోంది.

పట్టణాలుగా గుర్తిస్తేనే డబ్బులు : కొత్తగా ఏర్పాటు చేసిన 19 యూడీఏలకు కూడా ఆ మేరకు నిధులు రావాలంటే పోర్టల్‌లో ఆ ప్రాంతాలను పట్టాణాలుగా గుర్తిస్తేనే వస్తాయి. లేకపోతే గ్రామాలకు అందించే రూ.72వేలు మాత్రమే అందుతాయి. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లను గరిష్ఠంగా 4.50 లక్షలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఇంటికి రూ.5లక్షలు అందించనుంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు పోగా పట్టణాల్లో రూ.3.50లక్షలు గ్రామాల్లో రూ.4.28 లక్షలను రాష్ట్రం భరించనుంది.

పీఎంఏవైతో పేదల సొంతింటి కల సాకారం: కేంద్రమంత్రి

Urban Development Authorities in Telangana: కొత్తగా రెండు నగరాభివృద్ధి సంస్థలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.