Automatic Electric Garbage Collectors in Hyderabad : హైదరాబాద్ పరిశుభ్రతను మెరుగుపరచడానికి ఇనార్బిట్ మాల్‌తో కలిసి జీహెచ్‌ఎంసీ స్పార్ల్కింగ్ సైబరాబాద్ ప్రాజెక్టును బుధవారం ప్రారంభించింది. ఆరు ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ చెత్త సేకరణ యంత్రాల చెత్తను తొలగించేందుకు తీసుకొచ్చింది. నిర్మాణ సంస్థ ఈ రోబో వాహనాలను రూపొందించింది.
ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా : ఈ యంత్రాలు పబ్లిక్ స్థలాలు, పార్కులు, టెక్ హబ్‌లు, పలు నివాస ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంలో సహాయపడనున్నాయి. ప్రస్తుతం మాదాపూర్‌లోని ఐటీ సెక్టార్‌లో వీటిని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. వాటి పనితీరు ఆధారంగా నగరవ్యాప్తంగా తీసుకురానున్నారు. ప్రస్తుతం కొండాపూర్ (బొటానికల్ గార్డెన్), మాదాపూర్ (ఇనార్బిట్ మాల్, దుర్గం చెరువు పార్క్), హైటెక్‌సిటీ (రాయదుర్గం మెట్రోస్టేషన్, శిల్పారామం), గచ్చిబౌలి ప్రాంతాల్లో ఇవి తిరగనున్నాయి. ఈ వాహనాల ప్రారంభం నగర పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు కీలక ముందడుగని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు.
ఎవరూ చూడట్లేదని రోడ్లపై చెత్త వేస్తున్నారా? - ఇకపై మీ ఫొటోలు తీసి, మైక్‌లో అనౌన్స్ చేస్తారు
హైదరాబాద్‌లో పరిశుభ్రతను పెంచేందుకు జీహెచ్‌ఎంసీ ఎప్పుడు కొత్త ప్లాన్స్ వేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఇళ్లలో చెత్త తీసుకెళ్లేందుకు రోజు విడిచి రోజు కాంట్రాక్ట్ తీసుకున్నవారు వచ్చి తీసుకెళ్తున్నారు. వీధుల్లో ఉండే చెత్తను తొలగించేందుకు ఊడిచే వాళ్లు ఉన్నారు. ప్రతి గల్లీ ఊడిచి, చెత్తను తొలగిస్తారు. ఇలా హైదరాబాద్‌లో చెత్త సమస్యను సీరియస్‌గా తీసుకున్న జీహెచ్ఎంసీ ఎప్పుడు మెరుగైన సౌకర్యాల కోసం చూస్తోంది.
నిఘా వాహనాలు : ఇంటి నుంచి చెత్త సేకరించడానికి వస్తున్నా, కొంతమంది మాత్రం వీధి చివర్లనో, రోడ్లపై చెత్త వేస్తారు. అలాంటి వారి వల్ల దోమలు పెరిగి రోగాలు పెరిగిపోతున్నాయి. అలా చెత్తవేయడాన్ని కట్టడి చేయడం కోసం నిఘా వాహనాలు తీసుకొచ్చారు. ఎవరైనా రోడ్లపై, వీధుల్లో చెత్తను వెస్తే ఆ వాహనం వారి ఫొటోను తీస్తుంది. 'రోడ్లపై చెత్తవేయరాదు, చేసిన తప్పునకు మూల్యం చెల్లించుకోవాల్సిందే' అంటూ హెచ్చరిస్తుంది.
- ఈ యంత్రాలు ఎనిమిది గంటల పాటు శుభ్రం చేస్తాయి.
- వీటి సామర్థ్యం 240 లీటర్లు
- ఇరుకు, చిన్న ప్రాంతాల్లో ఇవి తేలిగ్గా శుభ్రం చేస్తాయి.
- ఒక కిలోమీటరు ప్రాంతాన్ని గంటలో శుభ్రం చేయగలదు
- వాహనంపై నిలబడి నడపొచ్చు
- వాటికి ఉండే వాటర్ స్ప్రింక్లర్లు దుమ్ము, ధూళి బయటకు రాకుండా చేస్తాయి.
- వాహనం వెనక వైపున్న తెరపై పర్యావరణహిత మంచి మాటలు ప్రదర్శిస్తారు.
జీహెచ్‌ఎంసీ విస్తరణ - ఓఆర్‌ఆర్ లోపల 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు?