ETV Bharat / entertainment

బాడీ షేమింగ్ ఎదుర్కొన్న స్టార్ హీరో!- కట్​ చేస్తే ప్రోడ్యూసర్​గా ఫుల్​ బిజీ - హీరోయిన్​ను కూడా పెళ్లాడారుగా! - HERO FACED BODY SHAMING

సినిమా బ్యాక్​గ్రౌండ్​ ఉన్నా కష్టాలు, బాడీ షేమింగ్ ఎదుర్కొన్ని హీరోగా ఎంట్రీ - కట్​ చేస్తే ప్రోడ్యూసర్​గా ఫుల్​ బిజీ

Actor Producer Jackky Bhagnani
Hero Faced Body Shaming (Getty Images, ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2025, 3:39 PM IST

Hero Faced Body Shaming : ఆయన బాలీవుడ్‌లో ఓ నిర్మాత. తన తండ్రి, సోదరి కూడా ప్రొడ్యూసర్లే. పుట్టింది సంపన్న కుటుంబంలో. కానీ ఒబెసిటీ కారణంగా వల్ల చాలా లావుగా తయారయ్యారు. దాని వల్ల ఇబ్బందులు సైతం ఎదుర్కొన్నారు. అయితే తర్వాతి కాలంలో అందుకు పూర్తి భిన్నంగా ఫిట్‌గా తయారయ్యారు. అంతేకాకుండా ఓ హీరోయిన్‌ను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంతకీ ఆయనెవరంటే?

సినీ బ్యాక్​గ్రౌండే కానీ!
జాకీ భగ్నానీ అంటే ఓ ప్రొడ్యూసర్​, యాక్టర్​ అని బీటౌన్​ వారికి తెలుసు. కానీ సౌత్​లో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ భర్త అంటే ఇట్టే కనిపెట్టేస్తారు. తండ్రి వాసు భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్‌ సైతం నిర్మాతలుగానే బాలీవుడ్​లో రాణిస్తున్నారు. అయితే జాకీ మాత్రం ప్రోడ్యూసర్​ కాకముందు యాక్టర్​గా పలు సినిమాల్లో మెరిశారు. అయితే సినీ బ్యాక్​గ్రౌండ్ ఉన్నప్పటికీ, ఇండస్ట్రీలోకి రావడాని ముందు తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

తను ఓ అస్తమా పేషంట్‌ అని, అప్పట్లో సుమారు 130 కిలోల బరువు ఉండేవారని చెప్పుకొచ్చారు. దాని కారణంగా తనను చాలా మంది ఎగతాళిగా చూసేవారని పేర్కొన్నారు. అంతేకాకుండా తనను ఏ అమ్మాయీ ప్రేమించదని తాను భావించినట్లుగా వెల్లడించారు. అయితే ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, ఫిట్​గా మారి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

2009లో 'కల్‌ కిస్‌నే దేఖా' అనే సినిమాతో బీటౌన్​లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2011లో F.A.L.T.U అనే కామెడీ సినిమా తీశారు. వీటితో పాటు 'అజబ్‌ గుజబ్‌ లవ్‌', 'రోగ్రెజ్‌', 'యంగిస్థాన్‌', 'వెల్‌కమ్‌ టు కరాచీ', 'మిత్రో' వంటి సినిమాల్లో నటించారు. 2016లో తమ సొంత బ్యానరైన 'పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌'లో 'సర్బ్‌జిత్‌' అనే సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత 'జవానీ జానేమన్‌', 'కూలీ నంబర్‌.1', 'బెల్‌ బాటమ్‌', 'కట్‌పుత్లి', 'మిషన్‌ రాణిగంజ్‌', 'గణ్​పత్​', 'బడే మియన్‌ ఛోటే మియన్‌' లాంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.ఇక జాకీకి 'Jjust Music' అనే సొంత మ్యూజిక్‌ సంస్థ కూడా ఉంది.

స్టార్ హీరోయిన్​తో వివాహం
సినిమాల్లో బిజీగా ఉండే జాకీకి ఓ స్వీట్ లవ్​ స్టోరీ కూడా ఉంది. స్టార్ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్​ను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలు పొరుగునే ఉండేవాళ్లట. లాక్‌డౌన్‌ టైమ్‌లో ఈ ఇద్దరూ క్లోజయ్యారని, అప్పటి స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే 2021లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారీ జంట. అక్టోబర్ 10న రకుల్ బర్త్‌డే సందర్భంగా జాకీ ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ పెట్టిన పోస్ట్​తో వీరి రిలేషన్​షిప్​ కన్ఫార్మ్ అయిపోయింది. ఇక 2024 ఫిబ్రవరి 21 న గోవాలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పలువురు ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు ఈ వేడుక ఘనంగా జరిగింది.

ఇక సోషల్‌ మీడియాలో జాకీ చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన పర్సనల్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌ గురించి రెగ్యులర్‌ అప్‌డేట్స్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటారు. ఇన్‌స్టాలో ఆయనకు సుమారు 3.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

టాలెంట్​ ఫుల్​- ఆఫర్లు డల్​! - ఈ బ్లాక్​బస్టర్ స్టార్స్​ను కాస్త గుర్తించడయ్యా!

అద్దె కట్టలేక రైల్వే ప్లాట్ ఫామ్​పై నిద్ర - కట్ చేస్తే బీటౌన్​లో మోస్ట్ పాపులర్ యాక్టర్​గా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.