ETV Bharat / state

గాంధీ భవన్​లో సందడే సందడి... - గాంధీభవన్​

గాంధీభవన్​ కాంగ్రెస్​ నేతలతో కోలాహలంగా మారింది. ఎంపీ టికెట్​ దరఖాస్తు చేసుకునేవారు, వివిధ సమావేశాలకు హాజరైనవారితో కిక్కిరిసిపోయింది.

సమావేశానికి హాజరైన నేతలు
author img

By

Published : Feb 12, 2019, 7:56 AM IST

Updated : Feb 12, 2019, 8:11 AM IST

గాంధీ భవన్​లో సందడే సందడి...
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ నాయకులతో సందడిగా మారింది. లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకునే నాయకులతోపాటు వివిధ కమిటీల సమావేశాలు ఉండడంతో కోలాహలం నెలకొంది. కాంగ్రెస్ నుంచి లోక్​సభ ఎన్నిల్లో పోటీ చేసేందుకు రెండో రోజున వంద మందికిపైగా ఆశావహులు దరఖాస్తులు చేశారు. ప్రధానంగా మహబూబాబాద్, నాగర్​ కర్నూల్​, పెద్దపల్లి, వరంగల్ నియోజకవర్గాల్లో ఒక్కో స్థానం నుంచి పదికి పైగా అర్జీలు వచ్చాయి. ఇవాళ దరఖాస్తు చేసిన వారిలో ప్రముఖులు మాజీ ఎంపీ నంది ఎల్లయ్య, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, వంశీచంద్‌ రెడ్డి, మాజీ మంత్రులు శంకర్​ రావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు భిక్షమయ్య గౌడ్, మృత్యుంజయ, మానవతా రాయ్​, చిత్తరంజన్ దాస్ తదితరులు ఉన్నారు. డీసీసీ అధ్యక్షుల సమావేశంతో పాటు ప్రచారకమిటీ, పబ్లిసిటీ కమిటీ, మీడియా కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశాలు జరిగాయి. విజయశాంతి అధ్యక్షతన జరిగిన పీసీసీ ప్రచార కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. లోకసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని స్థాయిల నాయకులను సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని తీర్మానించారు. ఏఐసీసీ చీఫ్​ రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఆహ్వానించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏఐసీసీ కార్యదర్శి, పీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లోకసభ నియోజకవర్గాల వారీగా మీడియా సమన్వయకర్తలను, జిల్లాకు ఒక మీడియా కన్వీనర్​ను నియమించాలన్నారు. గాంధీభవన్‌లో రోజుకు రెండు సార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
undefined

Intro:తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో వెలసిన అతి పురాతన చారిత్రక నేపథ్యం ఉన్న చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి స్వామి వారి కల్యాణ కార్యక్రమం వైభవంగా జరగగా మంగళవారం నిర్వహించే స్వామివారి రథోత్సవం లో తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు ఇందుకు ప్రభుత్వం ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు

Body:చెన్నకేశవస్వామి ఆలయంలో చారిత్రక నేపథ్యం ఉన్న అతిపెద్ద పురాతన శిల్పకళా నైపుణ్యంతో ఏర్పాటుచేసిన గంగాపురం చెన్నకేశవ స్వామి ఆలయం ఇది భక్తుల కొంగుబంగారంగా పిలవబడే ఈ ఆలయంలో భక్తుల కోరికలు తీర్చే చెన్నకేశవస్వామిని దర్శించుకోవడానికి బ్రహ్మోత్సవాలు వేలాది మంది పాల్గొంటారు రథోత్సవం కోసం ఏర్పాట్లు చేశారు భక్తుల సౌకర్యార్థం నీటి వసతి వాహనాల కోసం ప్రత్యేక బస్సులను ఆర్టీసీ వారు ఏర్పాటు చేస్తున్నారు మూడు రోజులపాటు కనులవిందుగా జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు

Conclusion:బ్రహ్మోత్సవాల సందర్భంగా రథోత్సవం అనంతరం శకట ఉత్సవం జరుగుతుంది ఇప్పటికే భక్తులు ఆలయానికి చేరుకుని అక్కడే నైవేద్యం తయారు చేసుకుని స్వామివారికి చెల్లించి తమ మొక్కులను చేసుకుంటున్నారు అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాల కోసం భారీగా పోలీసు బందోబస్తు భక్తులు ఉండేందుకు కల్పిస్తున్నారు
Last Updated : Feb 12, 2019, 8:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.