ETV Bharat / state

ప్రతి కుటుంబానికి కరోనా టెస్టులు చేయాలి: సీపీఎం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడిలో విఫలైమయ్యాయని సీపీఎం నగర కమిటీ కన్వీనర్​ మహేందర్​ ఆరోపించారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధాలకు వ్యతిరేకంగా హైదరాబాద్​ అంబర్​పేటలో నిరసన వ్యక్తం చేశారు.

cpm protest in hyderabad
అనుమానం ఉన్న ప్రతి కుటుంబానికి కరోనా టెస్టులు చేయాలి
author img

By

Published : Jun 17, 2020, 2:14 PM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అంబర్​పేట్ నియోజకవర్గ పరిధిలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆదాయ పరిమితి కంటే దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 7500 లను అందించాలని.. ప్రతి వ్యక్తికి 10కేజీల బియ్యం, నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని సీపీఎం నగర కమిటీ కన్వీనర్ మహేందర్ కోరారు.

అనుమానం ఉన్న ప్రతి కుటుంబానికి కరోనా టెస్టులు ఉచితంగా ప్రభుత్వమే చేయించాలని డిమాడ్​ చేశారు. విద్యుత్ ఛార్జీల భారం ప్రభుత్వమే భరించాలని.. కార్మికులను తొలగించరాదని.. పెన్షన్లలతో కోత విధించకూడదని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంబర్​ పేట్ నియోజకవర్గ పరిధిలో కారోనా కేసులు ఎక్కువ ఉన్నందుకు ప్రతిరోజు బస్తీల్లో రసాయనాలను పిచకారీ చేయించాలని మహేంద్ర డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: కరోనా మానసిక ఆందోళనను ఇలా జయించండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.