తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని కోహెడ మార్కెట్ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. గాలివానకు దెబ్బతిన్న కోహెడ మార్కెట్‌ను సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, పశ్య పద్మ, ఇతర నేతలతో నేతలతో కలిసి చాడ సందర్శించారు. అక్కడి రైతులు, వర్తకులు, కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కోహెడ మార్కెట్‌ను అద్దంలా తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి... ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని చాడ ప్రశ్నించారు.
ప్రాంగణంలో నేల చదును కోసమే 2 కోట్ల రూపాయల ఖర్చయిందని... నాణ్యతలేమి వల్లే ఈ దుర్ఘటన సంభవించిందని విమర్శించారు. రాజుల సొమ్ము రాళ్లపాలైన చందంగా పరిస్థితి తయారైందని చాడ విమర్శించారు. పారదర్శకత, దూరదృష్టి లేకపోవడం వల్లే కోహెడలో ఇంత విధ్వంసం జరిగిందన్నారు. నాసిరకం పనులు చేసిన గుత్తేదారుపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్