కేసీఆర్ సర్కార్ భావస్వేచ్ఛను హరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మండిపడ్డారు. జేఎన్‌యూ మాజీ నేత కన్హయ్యకుమార్ హాజరయ్యే బహిరంగసభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎంకు ఒక న్యాయం... సీపీఐకి ఒక న్యాయమా అని ప్రశ్నించారు.
సీపీఐ... ఒక జాతీయ పార్టీ అని ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. భావస్వేచ్ఛను హరిస్తున్న కేసీఆర్ సర్కారు తీరు శోచనీయమని మండిపడ్డారు. పోలీసులు చట్టాన్ని ధిక్కరిస్తే న్యాయస్థానాలే శరణ్యమని స్పష్టం చేశారు.