నిన్న పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు తలుపులు బిగించి తెలంగాణ ప్రకటించారని మాట్లాడటం విచారకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రధాని వ్యాఖ్యలను సీపీఐ ఖండిస్తోందన్నారు. తలుపులు బిగించి ప్రకటించినప్పుడు భాజపా ఎంపీలు వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్ కూడా పార్లమెంట్‌లో ఉన్నారు కదా అని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలతో సుష్మాస్వరాజ్‌ను ప్రధాని మోదీ అవమానించడమే అవుతోందని హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో స్పష్టం చేశారు.
ఆర్థిక తిరోగమన వైఖరితో కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని దుయ్యబట్టారు. ఆర్మీ అధిపతుల రాజకీయాలను చూస్తే దేశం మిలిటరీ వైపు వెళ్లుతుందని పేర్కొన్నారు. ఇది మంచి పరిణామం కాదని.. దీనిని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
ఇవీ చూడండి: మహబూబాబాద్ జిల్లాలో నిర్భయ తరహా ఘటన...