నిజాం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కాశీం ఇంటిపైన పోలీసులు దాడులు చేసి, హింసిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఇంట్లో సోదాలు నిర్వహించడమేంటనీ, ఆయనేమీ సాయుధ పోరాటం చేసినవాడు కాదన్నారు. కేవలం విప్లవ భావజాలంతో ప్రజలను చైతన్యం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడని తెలిపారు.
కళాశాలలో కాశీం మంచి పేరు సంపాదించుకున్నాడని నారాయణ అన్నారు. మూణ్నెళ్లుగా... అతనిపై కేసులు పెట్టి మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు నేరుగా ప్రత్యక్షంగా దాడులు చేస్తున్నారని నారాయణ ఆరోపించారు.
- ఇదీ చూడండి: ఫిబ్రవరి 1న నిర్భయ దోషులకు ఉరి