ప్రకృతిని దెబ్బతీసే యూరేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. యురేనియం తవ్వకాలపై అసెంబ్లీ తీర్మానాలు సరిపోవని, కేంద్రస్థాయిలో దీనిపై పోరాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని సీపీఐ బృందం కలిసింది. యురేనియం తవ్వకాలకు అనుమతులు ఉపసంహరించుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేసింది. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానాలు చేస్తారని, ఆ తర్వాత కేంద్రంతో లాలూచీ పడతారని ఆరోపించారు. గవర్నర్ను కలిసిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పళ్లా వెంకటరెడ్డి, అజీజ్ పాషా ఉన్నారు.
ఇదీ చూడండి:యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ అసెంబ్లీ తీర్మానం