ETV Bharat / state

కుటుంబ సమేతంగా ఓటేసిన సీపీ అంజనీకుమార్​ - హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తాజా వార్తలు

హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్​ అంబర్​పేట మున్సిపల్ గ్రౌండ్​ ఇండోర్​ స్టేడియంలో ఓటును వేశారు.

CP Anjanikumar exercised his right to vote with his family In Amber Peta Municipal Ground, Hyderabad
కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సీపీ అంజనీకుమార్​
author img

By

Published : Dec 1, 2020, 11:47 AM IST

హైదరాబాద్​ అంబర్​పేట మున్సిపల్​ గ్రౌండ్​లో ఇండోర్​ స్టేడియంలో హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​.. కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.

నగరంలో చాలా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ మొదలైందని తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కును సులభతరంగా ఉపయోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. ఓటరు తమ ఓటు హక్కును కేవలం ఐదు, పది నిమిషాల్లోనే ఉపయోగించుకునే చర్యలు చేపట్టడం జరిగిందని చెప్పారు. నగరంలో కొన్ని సమస్యాత్మక ప్రదేశాల్లో అదనపు బలగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పోలింగ్​ ప్రక్రియ విజయవంతం చేస్తామని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.