ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ రెండో విడత ప్రారంభమైంది. వైద్య సిబ్బందికి ఇప్పటికే టీకా వేయడం పూర్తికాగా... తాజాగా పోలీస్‌, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు వ్యాక్సిన్‌ అందించారు. మొదటిరోజు ప్రధానంగా పోలీసులకు టీకా వేశారు.

author img

By

Published : Feb 6, 2021, 8:04 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్
రాష్ట్రవ్యాప్తంగా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్
ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్

హెల్త్‌కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసిన వైద్యారోగ్యశాఖ... ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా వేయడం ప్రారంభించింది. పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల్లో కలిపి సుమారు 2 లక్షల మంది సిబ్బంది కొవిన్ యాప్‌లో నమోదు చేసుకోగా... వారందరికీ ఈనెల 12లోపు వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని వైద్యశాఖ పేర్కొంది.

ప్రధానంగా పోలీసులకు...

మొదటిరోజు ప్రధానంగా పోలీసుశాఖకు వ్యాక్సిన్ అందించింది. హైదరాబాద్‌ తిలక్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో డీజీపీ మహేందర్‌రెడ్డి... టీకా తీసుకున్నారు. పోలీసు సిబ్బంది, అధికారులు అందరూ వ్యాక్సినేషన్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మల్కాజిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌... టీకా తీసుకున్నారు.

సీపీతో పాటు 458 మంది...

నిజామాబాద్‌లో పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖ సిబ్బందికి టీకాలు వేశారు. యాదాద్రి ప్రభుత్వాసుపత్రిలో పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి కలిపి దాదాపు 100 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. నిర్మల్ జిల్లా భైంసాలో డీఎస్పీతోపాటు పలువురు పోలీసు సిబ్బంది కొవిడ్‌ టీకా తీసుకున్నారు. సిద్దిపేటలో సీపీ జోయల్‌ డేవిస్‌తోపాటు 458 మంది పోలీసులు వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

కరీంనగర్​లో...

కరీంనగర్‌లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మేయర్‌ సునీల్‌రావు ప్రారంభించారు. ఆరురోజుల్లో 987 మంది పారిశుద్ధ్య, మున్సిపల్‌ సిబ్బందికి టీకా వేయనున్నట్లు అధికారులు తెలిపారు. రోజు 200 మందికి టీకా పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి కరోనా టీకా తీసుకున్నారు.

ఇదీ చూడండి: నేనూ వ్యాక్సిన్ వేయించుకున్నా.. మీరూ తీసుకోండి: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.