ETV Bharat / state

BRK Bhavan Covid Cases: బీఆర్కేభవన్‌లో కొవిడ్‌ కేసులు కలకలం - Corona latest updates

BRK Bhavan Covid Cases: తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. వైరస్ ప్రభావం ప్రభుత్వ కార్యాలయాలపైనా పడింది. సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కేభవన్‌లో కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

Covid
Covid
author img

By

Published : Jan 11, 2022, 5:27 AM IST

BRK Bhavan Covid Cases: కరోనా వైరస్ ఉద్ధృతి ప్రభావం ప్రభుత్వ కార్యాలయాలపైనా పడింది. పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మహమ్మారి బారిన పడుతున్నారు. సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కేభవన్‌లో కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కొద్ది రోజుల్లోనే కేసుల సంఖ్య పెరిగింది. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియలో కీలకంగా ఉన్న ఓ ఉన్నతాధికారితోపాటు... పలువురు, అధికారులు, సిబ్బందికి పాజిటివ్ నిర్ధరణయింది.

నీటిపారుదలశాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో కీలకంగా వ్యవహరించే ఇద్దరు ఉన్నతాధికారులు వైరస్‌ బారినపడ్డారు. దీంతో సోమవారం జరగాల్సిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం కూడా వాయిదా పడింది. జలసౌధలో ప్రత్యేకంగా కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇదీచూడండి: కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్- రాత్రి 10 గంటల వరకు టీకా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.