ETV Bharat / state

ఫిలింనగర్​లో దారుణం- అప్పు తీర్చలేదని హతమార్చారు - అప్పు చెల్లించలేదని దంపతులను హత్య చేసిన నిందితులు

Couple Murder in Hyderabad : అప్పు రెండు ప్రాణాలను బలితీసుకుంది. వ్యాపార ఒప్పందంలో తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోవడం దంపతుల హత్యకు దారి తీసింది. పోలీసులకు ఆధారాలు లభించకుండా నిందితులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. హత్యానేరం తమమీదికి రాకుండా యత్నించారు. భార్యను హత్య చేసి భర్త పారిపోయాడని పోలీసులకు అనుమానం కలిగేలా చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు 10 రోజుల తర్వాత నిందితులను అరెస్ట్ చేశారు.

Couple Murder in Hyderabad
Couple Murder
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2023, 7:00 AM IST

Updated : Dec 10, 2023, 7:05 AM IST

ఫిలింనగర్​లో దారుణం- డబ్బులు తీసుకుని మోసగించారని మట్టుపెట్టారు

Couple Murder in Hyderabad : యూట్యూబ్‌ ద్వారా ఏర్పడిన పరిచయం, వ్యాపారానికి బాటలు వేసింది. గొర్రెల పెంపకం, విక్రయం వ్యాపారంలోభాగస్వామ్యం కోసం విడతలవారీగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడకపోవడం ఇరువురి మధ్య కక్షకు దారితీసింది. చివరకు దంపతుల హత్యకు కారణమైంది. గతనెల 29న హైదరాబాద్‌లోని సత్యకాలనీలో మహిళ మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. అక్కడకి వెళ్లిన పోలీసులు ఆమెని ఫాతిమాగా గుర్తించి హత్యచేసినట్లుగా కేసు నమోదు చేశారు.

Couple Killed Brutally in Hyderabad : మృతురాలి భర్తఫోన్ స్విచాఫ్ ఉండటం, అతని హెల్మెట్, ఇతర వస్తువులు లభించగా భర్త హత్య చేసినట్లు అనుమానించారు. ఫాతిమా మృతదేహానికి పోస్టుమార్టం చేశాక కుటుంబీకులకు అప్పగించారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాలు పరిశీలించగా, ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు గతనెల 29వ తేదీ మధ్యాహ్నం లోపలికి వెళ్లినట్లు గుర్తించారు. ఆ ముగ్గురు ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు సమీపంలో 200 సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరికి అందులో ఒకరు మణికొండకు చెందిన సమీర్‌గా గుర్తించారు. అతడిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఫాతిమాను చంపింది భర్తకాదని ముంబయికి చెందిన అజ్ఘర్ పాషాగా గుర్తించారు.

మహబూబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు.. బాలుడి హత్యకేసులో నిందితుడికి మరణశిక్ష

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : హైదరాబాద్‌కు చెందిన మహిళను పదేళ్ల క్రితం పెళ్లిచేసుకున్న అజ్ఘర్‌ పాషా, నదీం కాలనీలో ఉంటూ గొర్రెల పెంపకం, విక్రయం చేస్తున్నాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం యూట్యూబ్‌ ద్వారా జుబేర్‌ ఖాద్రీతో పరిచయం ఏర్పడింది. ఆనంతరం వారిద్దరి మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. జుబేర్‌ ఫామ్​హౌజ్‌లో గొర్రెలు, మేకలు పెంచేందుకు అజ్ఘర్‌ విడతల వారీగా 20 లక్షలకు పైగా చెల్లించాడు. లాభం ఇవ్వకపోవటంతో డబ్బులు ఇచ్చేయాలని కోరగా జుబేర్‌ దాటవేస్తూ వచ్చాడు. కక్షపెంచుకున్న అజ్ఘర్‌, జుబేర్‌ హత్యకు కుట్ర పన్నాడు.

అందుకోసం ముంబైలోని స్నేహితుడు సల్మాన్‌తో పాటు మణికొండకు చెందిన సమీర్ సాయం తీసుకున్నాడు. గతనెల 28న బిర్యాని తిందామంటూ నదీంకాలనీలో ఫామ్‌హౌజ్‌కి జుబేర్‌ని పిలిపించాడు. అక్కడకి వచ్చిన జుబేర్‌ని ముఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి హత్యచేసి సమీపంలోని చెరువుపక్కన మృతదేహం పూడ్చిపెట్టారు. ఇంట్లో నగదుదాచి ఉండొచ్చని భావించిన అజ్ఘర్, జుబేర్‌ ఇంటికి వెళ్లారు. ఎక్కడా వెతికినా డబ్బులు కనపడలేదు.

'దర్యాప్తులో కాల్​ డేటాను వెతకడం జరిగింది. 200 నుంచి 300 వరకు సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాం. అవన్నీ పరిశీలించగా అందులో ముగ్గురు వ్యక్తులు అనుమానంగా కనిపించారు. ఆ ముగ్గురు ఎవరనే విషయంపై స్థానికులను కనుక్కున్నాం. ఇద్దరు మాత్రం ట్రేస్ అవ్వలేదు. ఎందుకంటే వారు ముంబయికి చెందిన వారు. ఒక వ్యక్తి మాత్రం హైదరాబాద్​కి చెందిన వ్యక్తే. అతన్ని స్థానికులు గుర్తుపట్టారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే హత్యలకు సంబంధించిన అసలు విషయం బయటపడింది.' - రామకృష్ణ, ఫిలింనగర్‌ సీఐ

Accused Killed Couple for Not Paying Debt : రాత్రివరకు ఇంట్లో ఉన్న నిందితులు, జుబేర్‌ భార్య ఫాతిమా రాగానే గొంతునులిమి చంపి చున్నీతో ఫ్యాన్‌కి ఉరేసి ఒంటిపై ఉన్న 9 తులాల బంగారం తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి ఇంటికి వచ్చిన ఫాతిమా సోదరి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగుచూసింది. జంటహత్యలకు పాల్పడిన ముగ్గురి నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించారు.

యువకుడిని హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టిన వ్యక్తి- తల, మొండెం వేరు చేసి

LB Nagar Murder Case Updates : నాడు తండ్రినే కడతేర్చాడు..! నేడు మరో ప్రాణం తీశాడు

Last Updated : Dec 10, 2023, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.