ETV Bharat / state

గ్రేటర్ విజృంభణ.. ప్రాథమిక వైద్య కేంద్రాల్లోనూ చికిత్సకు సన్నాహాలు - హైదరాబాద్‌ కరోనా మరణాలు

జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజు కేసుల సంఖ్య వేయి దాటుతోంది. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. కొవిడ్ పరీక్ష నిర్ధారణ కేంద్రాల వద్ద అనుమానితులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. పరీక్షల సంఖ్య పెరగడంతో భారీగా కేసులు బయటపడుతున్నాయి. రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో కొత్తగా ఆయా ప్రాంతాల్లో పడకలను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

CORONA
CORONA
author img

By

Published : Jul 10, 2020, 9:26 PM IST

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో కరోనా ఉద్ధృతిలో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు . శుక్రవారం కూడా పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ మహమ్మారి నిర్ధరణకు యాంటీజెన్‌ పరీక్షలు పెద్దసంఖ్యలో చేస్తుండటంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా భారీగా భయటపడుతున్నాయి. జంటనగరాల పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక వైద్య కేంద్రాలకు కరోనా పరీక్షల కోసం అనుమానితులు, లక్షణాలు ఉన్న వారు క్యూ కడుతున్నారు. కరోనా పరీక్షల కోసం రోజుల కొద్ది తిప్పుతుండటంతో సహనం కోల్పోతున్న బాధితులు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రిలో ఈ తరహా గొడవ కారణంగా మూడు గంటలపాటు పరీక్షలు నిలిచిపోయాయి.

ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పడకలు

రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో కొత్తగా ఆయా ప్రాంతాల్లో పడకలను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రాథమిక వైద్య కేంద్రాల్లో కూడా వసతులను బట్టి 20 నుంచి 50 బెడ్లను ఏర్పాటు చేసి స్థానికంగా రోగులను ఉంచి చికిత్స అందించాలని నిర్ణయించారు. జంటనగరాల పరిధిలో రోజుకు 1,500 కేసులు వస్తుండగా ఈ నెలాఖరుకు ఆ సంఖ్య రెట్టింపు కానుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలో ఇవాళ కొత్తగా 46 మందికి కరోనా సోకింది. వారిలో యూసఫ్‌గూడ 20, రహ్మత్‌నగర్‌- 12, వెంగళరావునగర్‌లో 6, బోరబండలో 5, ఎర్రగడ్డలో ముగ్గురికి వైరస్‌ నిర్ధారణ అయింది.

కుత్బుల్లాపూర్‌లో 76 కేసులు

మొదటి నుంచి కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మీర్‌పేట మున్సిపల్‌ పరిధిలో తాజాగా 14 మందికి కరోనా సోకింది. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలో 76 కేసులు నమోదయ్యాయి. అంబర్‌పేట డివిజన్‌ పరిధిలో 46 మంది కొవిడ్ బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం తహసీల్దార్‌ కార్యాలయంలో బాధితులు పెరుగుతున్నారు. కందుకూరు ఆర్డీఓ కార్యాలయంలో ముగ్గురికి వైరస్ సోకింది. యాచారం మండలంలో ముగ్గురికి, మంచాల మండలంలో ఇద్దరికి, ఇబ్రహీంపట్నంలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధరణ అయింది. వికారాబాద్‌ జిల్లా తాండూరులో కరోనా కేసులు పెరుగుతుండటంతో వారం పాటు అన్ని వ్యాపారాలు మూసివేయాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి: కూల్చివేత ఎఫెక్ట్​: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం ​విచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.