ETV Bharat / state

కరోనా వేళ.. దంపతుల మధ్య ‘ఆర్థిక’ తగాదాలేల? - latest news of financial crisis in corona time

కరోనా మహమ్మారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని కుదేలయ్యేలా చేస్తోంది. ఇంటి ఖర్చులకు డబ్బు సరిపోవడం లేదంటూ దంపతుల మధ్య ఆర్థిక తగాదాలు తలెత్తుతున్నాయి. పనుల్లేక కుటుంబంలో మనశ్శాంతి కరవై, మానసిక ఒత్తిడికి దారితీస్తోంది. ఈ పరిస్థితి గట్టెక్కాలంటే ఏం చేయాలి? ఒకరికి ఒకరు ఎలాంటి సాయం అందించుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా గాడిలో పెట్టాలి వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయా అయితే ఈ కథనం చదవండీ.

corona-virus-financial-tips-for-couple-in-this-financial-crisis
కరోనా వేళ.. దంపతుల మధ్య ‘ఆర్థిక’ తగాదాలేల?!
author img

By

Published : Jul 2, 2020, 3:47 PM IST

‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని ప్రముఖ ఆర్థికవేత్త కార్ల్‌ మార్క్స్‌ చెప్పినట్లు.. మానవ సంబంధాలు బాగుండాలంటే ఆర్థికాభివృద్ధి పాత్ర కూడా కీలకమే. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. ఫలితంగా ఈ ప్రభావం దాదాపు అన్ని రంగాలపై పడుతోంది. దీంతో నెలాఖరుకు అకౌంట్‌లో జీతాలు పడని వారెందరో! అకౌంట్‌లో జీతం పడకపోవడం వల్ల ఏం చేయాలో తోచక మానసిక ఒత్తిడికి గురవడం, ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక ఇంట్లో వాళ్ల మీద చూపించడం వల్ల గొడవలకు తెరలేస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో భార్యాభర్తలిద్దరూ సంయమనం పాటిస్తూ, ఒకరికొకరు తోడుగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

తోడుగా నిలవండి..

మొన్నటి వరకు నెల తిరగ్గానే అకౌంట్‌లో వేలకు వేలు జీతాలు వచ్చి పడేవి. ఇప్పుడు ఉద్యోగం కోల్పోవడం లేదా జీతాలు రాకపోవడం వల్ల ఆ ప్రభావం మనల్ని మానసికంగా కుంగదీస్తుంది. కాబట్టి భర్తకు భార్య, భార్యకు భర్త తోడుగా నిలవాల్సిన సమయం ఇదేనని గుర్తుపెట్టుకోండి. మీ భాగస్వామికి ధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేయండి. అప్పటి వరకు వేలకు వేలు సంపాదించే వ్యక్తి ఒక్కసారిగా ఇంట్లో ఖాళీగా కూర్చుంటే.. మానసికంగా ఒత్తిడి ఎదురవడం సహజం. కాబట్టి వారిలో మానసిక స్థైర్యాన్ని నింపడంలో భార్యలదే ప్రధాన పాత్ర. అలాగే కొన్ని కుటుంబాల్లో ఖర్చులు, ఇంటి బాధ్యతల్లో భార్యలదే పైచేయిగా ఉంటుంది. అలాంటివారికి భర్తలు మద్దతుగా నిలవాలి. ప్రస్తుత రోజులు ఎప్పటికీ ఇలాగే ఉండవని.. త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగాలి. అంతేకానీ జీతం రాలేదన్న కోపాన్ని ఒకరిపై ఒకరు చూపించుకుంటే ఆ ఇల్లు నరకమే అవుతుంది తప్ప మరే ప్రయోజనం ఉండదు.

మాటే మంత్రము..

మానసిక గాయాన్ని తగ్గించేందుకు మాటను మించిన మంత్రం మరోటి ఉండదని చెబుతుంటారు. ఉద్యోగ లేమి, ఆర్థిక సంక్షోభం ద్వారా గాయపడిన మనసును మాట అనే మందుతోనే నయం చేయాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో సానుకూల దృక్పథంతో కూడిన మాటలు మాట్లాడాలి. అంతేకానీ.. ఉద్యోగం లేదు.. జీతం రాలేదు.. ఇప్పుడు ఏంటి పరిస్థితి..? మన జీవనం సాగేది ఎలా? పిల్లల ఖర్చులు ఎలా వెళ్లదీయాలి? ఇలాంటి మాటలను పదే పదే తలచుకుంటూ కుంగిపోవడం అస్సలు సరికాదు. ఈ క్రమంలో దంపతులిద్దరూ తమ పాజిటివిటీని పెంచుకోవడానికి వారికి నచ్చిన పనులు చేయడం, నైపుణ్యాల్ని పెంచుకోవడానికి ఏవైనా ఆన్‌లైన్‌ కోర్సులు నేర్చుకోవడం.. వంటి మార్గాల్ని అన్వేషించాలి. ఫలితంగా ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది.

ఉన్నంతలో బతికేద్దాం..

కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కి మళ్లీ ఉద్యోగం సంపాదించుకునేంత వరకు దుబారా ఖర్చులకు కళ్లెం వేయాలి. వీలైనంత తక్కువ ఖర్చుతో బతుకు బండిని నడిపించే ప్రయత్నం చేయాలి. ఇది సాధ్యం కావాలంటే ఆలుమగలిద్దరూ ఒకే మాటపై నిలబడాలి. ఇక ప్రభుత్వాలు అందిస్తోన్న పలు పథకాలను వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా మీరు ఆర్థికంగా మళ్లీ నిలదొక్కుకునేంత వరకు ఏవైనా ఈఎమ్‌ఐలు కట్టాల్సినవి ఉంటే వాటిని వాయిదా వేసుకునే వెసులుబాటు ఉందో తెలుసుకోండి.. తద్వారా ఒత్తిడి కాస్త తగ్గే అవకాశం ఉంటుంది.

ఒకరికొకరు సాయం..

ఇక భర్త ఉద్యోగం పోతే.. భార్య తన నైపుణ్యాలతో తను ఆదాయం సంపాదించగలిగిన మార్గాలేవైనా ఉంటే ఆలోచించాలి. తద్వారా ఇద్దరూ సంపాదన లేకుండా ఉండే కంటే ఒకరు సంపాదిస్తే వచ్చిన ఆదాయంతోనే ఖర్చులు వెళ్లదీసుకోవచ్చు. ఇలా భర్తకు తిరిగి ఉద్యోగం వచ్చేంత వరకు భార్య ఆసరాగా నిలవాలి. ఒకవేళ భార్య తన ఉద్యోగాన్ని కోల్పోతే భర్త కూడా తనవంతు సాయాన్ని అందించాలి. తమకు తెలిసిన స్నేహితులు, బంధువుల ద్వారా అప్పటికప్పుడు చేసుకునేందుకు వీలుగా ఏదైనా చిన్న ఉద్యోగం కోసం ప్రయత్నించడంలోనూ తప్పులేదు. ఇలా కష్టకాలంలో ఒకరికొకరు సాయంగా, తోడుగా నిలిస్తే అటు ఇంటి ఖర్చులు గట్టెక్కుతాయి.. ఇటు అనుబంధంలోని అన్యోన్యత రెట్టింపవుతుంది.

ఆర్థిక నిపుణుల సూచనలు..

ఈ సంక్షోభం నుంచి కుటుంబాన్ని గట్టెక్కించడానికి ఆర్థిక నిపుణుల సూచనలు కూడా తీసుకుంటే మంచిది. ఈ క్రమంలో ఇప్పటి వరకు మీరు పొదుపు చేసిన డబ్బుల్ని ఇప్పుడు ఎలా ఉపయోగించుకోవచ్చు? భవిష్యత్తులో వచ్చే ఆర్థిక కష్టాలను సమర్థంగా ఎలా ఎదుర్కోవాలి?.. ఇలా మీకు సందేహం ఉన్న ప్రశ్నలన్నింటికీ ఆర్థిక నిపుణులు చక్కటి సలహాలు అందిస్తారు. ఈ క్రమంలో మీకు తెలిసిన ఆర్థిక నిపుణులైతే మరీ మంచిది. తద్వారా ఉన్న డబ్బులతోనే ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తగిన ఆర్థిక ప్రణాళికలను రచించుకుంటే మరింత సులభంగా ఉంటుంది.

ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను ఫాలో అయితే అటు కరోనా సృష్టిస్తోన్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడమే కాకుండా.. ఆలుమగలిద్దరూ తమ బంధాన్ని బలపర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సో.. ఇక ఆలస్యమెందుకు.. ప్రొసీడ్‌!

ఇద చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.