ETV Bharat / state

Vaccination: రాష్ట్రంలో ఆ రోజుల్లో నో వ్యాక్సినేషన్​.. కారణమేంటంటే.! - corona vaccination stopped today

రాష్ట్రంలో ఈ రోజు కరోనా టీకా(covid vaccination) కార్యక్రమాన్ని ఆపివేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రతి బుధవారం చిన్నారులకు టీకా పంపిణీ కార్యక్రమం, ఆదివారం సెలవు రోజు కావడంతో ఆ రెండు రోజులు వ్యాక్సినేషన్​ ఉండదని స్పష్టం చేసింది. వారంలో కేవలం ఐదు రోజులు మాత్రమే టీకా పంపిణీ కొనసాగుతుందని పేర్కొంది.

covid vaccination
కొవిడ్​ వ్యాక్సినేషన్​
author img

By

Published : Jul 7, 2021, 1:04 PM IST

రాష్ట్రంలో బుధవారం కొవిడ్ వ్యాక్సినేషన్‌(covid vaccination) కార్యక్రమం ఉండదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రతి బుధవారం చిన్నారులకు టీకా పంపిణీ కార్యక్రమం ఉంటుందని... అందువల్ల ఈ రోజు కరోనా టీకా వేయడం లేదని స్పష్టం చేసింది. ఆదివారం కూడా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఉండదని... వారంలో ఐదు రోజులు మాత్రమే టీకా పంపిణీ కొనసాగుతుందని వివరించింది.

గణాంకాలు

ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో వ్యాక్సినేషన్​పై వైద్యారోగ్యశాఖ(telangana medical and health department) గణాంకాలను విడుదల చేసింది. కోటి 19 లక్షల 64 వేల 802 కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. అందులో కోటి లక్షా 72 వేల 792 మందికి మొదటి డోస్ పూర్తి కాగా.. మరో 8 లక్షల 96వేల 5 మంది మాత్రమే రెండో డోస్ పూర్తి చేసుకున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 17లక్షల 92 వేల 10 మందికి మొదటి, రెండో డోసుల టీకాలు అందించారు.

సగం పైగా మొదటి డోస్​

రాష్ట్రంలో 2 కోట్ల 20 లక్షల మంది టీకా పొందేందుకు అర్హులుగా ఉన్నారని వైద్యోరోగ్య శాఖ తెలిపింది. అందులో ఇప్పటికే కోటి 10 లక్షల 68 వేల 933 మందికి టీకాల పంపిణీ పూర్తైంది. దాదాపు యాభై శాతానికి పైగా వ్యాక్సిన్‌ వేశారు. అయితే అందులో అత్యధిక శాతం మందికి ఒక్కడోసు మాత్రమే పూర్తి కావటం గమనార్హం. పాక్షిక వ్యాక్సినేషన్‌తో సైతం కొంత వరకు రక్షణ లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు వీలైనంత త్వరగా ఎక్కువ మందికి మొదటి డోస్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

రాష్ట్రంలో ఇప్పటికే ప్రాధాన్యత వారీగా టీకా కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం.. పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని సాధించే దిశగా చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ, కార్పొరేట్​ ఆస్పత్రులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మెగా వ్యాక్సినేేషన్​ డ్రైవ్​లను చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా త్వరితగతిన టీకా పంపిణీ పూర్తయ్యేలా కృషి చేస్తోంది.

ఇదీ చదవండి: DH Srinivas: నెల రోజుల్లో ప్రభుత్వాసుపత్రుల్లో పడకలన్నింటికీ ఆక్సిజన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.