ETV Bharat / state

ప్రైవేటుగా కరోనా చికిత్సలొద్దు

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కరోనా చికిత్సలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు, కార్పొరేట్​ ఆస్పత్రుల్లో ఈ చికిత్సలను చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

corona-treatment-only-in-government-hospitals-in-telangana
ప్రైవేటుగా కరోనా చికిత్సలొద్దు
author img

By

Published : Apr 16, 2020, 7:52 AM IST

కరోనా వైరస్‌(కొవిడ్‌ 19) చికిత్సలను ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఈ చికిత్సలను చేయవద్దంటూ తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ దగ్గు, జ్వరం లక్షణాలతో వచ్చిన వారిని చేర్చుకున్నా.. వారిలో కరోనా నిర్ధారణ అయితే గాంధీ ఆసుపత్రికే పంపించాలని ఆదేశించింది. నిర్ధారణ పరీక్షల కోసం కూడా ప్రభుత్వ ఆసుపత్రులకే పంపించాలని సూచించింది. గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం 12 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతుండడాన్ని ఆరోగ్యశాఖ తీవ్రంగా పరిగణించింది. ఇకపై కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు చికిత్స అందించవద్దంటూ ఆసుపత్రి వర్గాలకు సూచించినట్లు తెలిసింది. ఒకదశలో ఆసుపత్రి అనుమతులనూ రద్దుచేయాలని భావించినట్లుగా సమాచారం.

గత నెల మార్గదర్శకాల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కరోనా చికిత్సకు అనుమతించడంతో.. ఆ మేరకు ఇప్పటికీ అక్కడ వైద్యాన్ని కొనసాగిస్తున్నట్లుగా వైద్యశాఖ విచారణలో తేలింది. ప్రస్తుత పరిస్థితుల్లో వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స ద్వారా కచ్చితమైన సమాచారం అందడం లేదనీ, తద్వారా కరోనా పాజిటివ్‌ వ్యక్తులు పూర్తిగా చికిత్స పొందకుండానే వెళ్లిపోతున్నట్లుగా గుర్తించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదకర ధోరణితో వైరస్‌ వ్యాప్తి సమాజంలో అతి వేగంగా జరిగే అవకాశముంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గందరగోళానికి, అస్పష్టతకు తావివ్వకుండా.. కరోనా సోకిన వ్యక్తులందరికీ గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో తాజా మార్గదర్శకాలను విడుదల చేసినట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి. కరోనా పాజిటివ్‌ వ్యక్తులను ఆసుపత్రుల్లో అప్పగించేటప్పుడు కచ్చితంగా పాటించాల్సిన మార్గదర్శకాలను సూచించింది.

ప్రైవేటుకు మార్గదర్శకాలు..

  • ఆసుపత్రికి బాధితులు దగ్గు, జ్వరం, ఇతర శ్వాసకోశ సమస్యలతో వచ్చినా.. ముందుగా అనుమానిత లక్షణాలున్నవారిని కింగ్‌కోఠి ఆసుపత్రికి పంపించాలి.
  • కింగ్‌కోఠి ఆసుపత్రిలో అనుమానిత లక్షణాలున్నవారిని చేర్చుకొని, అక్కడే నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపిస్తారు.
  • పరీక్షల్లో పాజిటివ్‌గా తేలితే ఆ వ్యక్తులను గాంధీ ఆసుపత్రికి పంపించాలి.
  • అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులను చేర్చుకోవాల్సి వచ్చినా.. నిర్ధారణ పరీక్షలకు నమూనాలను గాంధీ ఆసుపత్రికి పంపించాలి.
  • పరీక్షల్లో కరోనా అని నిర్ధారణ జరిగితే.. ప్రైవేటు ఆసుపత్రి నుంచి కూడా గాంధీ ఆసుపత్రికి పంపించాలి.
  • ఒకే రోగికి సంబంధించి మూడునాలుగు నమూనాలు పరీక్షల కోసం పంపించాల్సి వస్తే.. ఒకే గుర్తింపు సంఖ్యతో పంపించాలి.
  • కరోనా పాజిటివ్‌ వ్యక్తిని ఆసుపత్రి నుంచి పంపించాల్సి వచ్చినప్పుడు.. సమాచారాన్ని తప్పక వైద్యశాఖకు చేరవేయాలి.
  • ఇతర శ్వాసకోశ సమస్యలతో చికిత్సలకు వచ్చే వారి సమాచారాన్నీ తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి.
  • కరోనా అని నిర్ధారణ కాకపోయినా ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లతో వ్యక్తి మృతిచెందినా.. ఆ సమాచారాన్ని సైతం తప్పక ప్రభుత్వం దృష్టికి తేవాలి.

పాజిటివ్‌ వ్యక్తి అప్పగింతకు రసీదు

కరోనా పాజిటివ్‌ వ్యక్తులను ఆసుపత్రుల్లో అప్పగించేటప్పుడు నిర్దిష్ఠ విధానాన్ని పాటించకపోవడంతో కేసుల సమాచార సేకరణపై స్పష్టత కొరవడుతోందని వైద్యశాఖ గుర్తించింది. దీన్ని నివారించడానికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీచేసింది. హైదరాబాద్‌ సహా ఏ జిల్లాల నుంచి కరోనా పాజిటివ్‌ కేసులను గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నా కచ్చితంగా పాటించాల్సిన మార్గదర్శకాలను సూచించింది.

  • కరోనా పాజిటివ్‌ వ్యక్తి సమగ్ర సమాచార పత్రాన్ని సంబంధిత జిల్లా వైద్యాధికారి ధ్రువీకరించాలి.
  • జిల్లాల నుంచి పంపించేటప్పుడు 108 వాహన సిబ్బందికి ఆ ధ్రువపత్రాన్ని అందించి, గాంధీ ఆసుపత్రిలో చేర్చేలా అవగాహన కల్పించి పంపించాలి. ఆ బాధ్యత సంబంధిత జిల్లా వైద్యాధికారులదే.
  • గాంధీ ఆసుపత్రిలో కరోనా విభాగంలో సంబంధిత వ్యక్తిని అప్పగించినప్పుడు.. ఆ వ్యక్తికి సంబంధించిన సమాచార పత్రంపై రసీదును పొందాల్సి ఉంటుంది.
  • గాంధీలో ఏ యూనిట్‌లో ఏ విభాగాధిపతి పరిధిలో చేర్పించారనే వివరాలను పేర్కొంటూ స్టాంప్‌తో కూడిన రసీదును గాంధీ సిబ్బంది ఇవ్వాలి.
  • ఆ రసీదును 108 అంబులెన్సు సిబ్బంది తిరిగి సంబంధిత జిల్లా వైద్యాధికారికి అందజేస్తారు.
  • రసీదుతో పాటు సమాచారాన్ని ఆన్‌లైన్‌లో జిల్లా వైద్యాధికారి పొందుపర్చాలి.
  • తద్వారా కరోనా పాజిటివ్‌ వ్యక్తి ఆసుపత్రిలో చేరారా? లేదా?.. అనే గందరగోళానికి తావుండదు.
  • ఆసుపత్రిలో చేర్చాక అక్కడి నుంచి చికిత్స అందించే నిపుణుల పర్యవేక్షణ ఉంటుంది.

ఇవీ చూడండి: నేడు డిశ్చార్జి కానున్న 128 మంది కరోనా బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.